Ads
మనం సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లని చూస్తూ ఉంటాం. కానీ అలా మనం పొరపాటు అనుకున్న ప్రతి విషయం పొరపాటు కిందకి రాదు.
అందులో కొన్ని డైరెక్టర్ సినిమాటిక్ లిబర్టీ తో మోడిఫై చేసిన సన్నివేశాలు కూడా ఉంటాయి. అందుకు ఒక ఉదాహరణ ఇంద్ర సినిమా లోని ఈ సీన్.
ఇంద్ర సినిమా లో ఫ్లాష్ బ్యాక్ అంటే చిరంజీవి ఇంద్ర సేనా రెడ్డి గా ఉన్నప్పుడు వచ్చే సీన్ లో ఆ రోజు రాఖీ పండుగ జరుపుకుంటారు, అదే రోజు హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. సాధారణంగా రాఖీ, హోలీ ఒకే రోజు రావు. కానీ ఈ సినిమా కోసం డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి దీన్ని పొరపాటు అనడం కంటే సినిమాటిక్ లిబర్టీ అనడమే కరెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో జరిగిన ఈ పొరపాటును గుర్తించిన ఇంద్ర సినిమా మేకర్స్, సినిమా విడుదలైన కొద్ది రోజులకే “ఇంద్ర సినిమాలో ఒక పొరపాటు ఉంది. అదేంటో కనిపెట్టండి” అని కాంటెస్ట్ కూడా పెట్టారు.
Ads
ఇలా ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు, ఎన్నో సినిమాల్లో సినిమాటిక్ లిబర్టీ తో ఇలా ఎన్నో సన్నివేశాలు మార్చారు. కొన్ని సన్నివేశాలకు ఈ సినిమాటిక్ లిబర్టీ అనేది అవసరం. ఎందుకంటే సినిమా అనేది ఫిక్షనల్. అంటే ఒక వేళ ఇలా జరిగితే ఎలా ఉంటుంది ? అని డైరెక్టర్ కి వచ్చిన ఆలోచనని తెరమీద చూపించడం. ఏ ఫిక్షనాలిటీ తో అయితే ఒక డైరెక్టర్ తన కథను రాసుకుంటారో, అదే ఫిక్షనాలిటీ తో కథ లోని సీన్స్ ని కూడా రాసుకుంటారు.
సినిమాటిక్ లిబర్టీ వలన సినిమాకి ఎటువంటి సమస్య అవ్వదు. అంతేకాకుండా సినిమాల్లో జరిగే పొరపాట్ల వల్ల కూడా సినిమాకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాన్నిబట్టి ఆడియన్స్ కూడా ఇలాంటి పొరపాట్లని అంత పెద్దగా పట్టించుకోరు అని, వీటివల్ల నిజంగా సినిమాకి జరిగిన నష్టం ఏమీ లేదు అని వదిలేస్తారు అని, ముఖ్య ప్రాధాన్యత కథకి మాత్రమే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా కొంతకాలం తర్వాత సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా?” అనిపిస్తుంది అంతే.