15 కోట్లు పెట్టి తీసిన పాటలో ఈ మిస్టేక్ ఎలా చేశారు..? జరగండి పాటలో ఇది గమనించారా..?

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 28వ తేదీన తన పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుండి జరగండి పాట రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటని, దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడారు. ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అనంత శ్రీరామ్ ఈ పాటని రాశారు. పాట చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. రియల్ లొకేషన్ ని పోలిన ఒక సెట్ వేసి ఈ పాటని చిత్రీకరించారు.

Ads

ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు, హీరోయిన్ కియారా అద్వానీ కూడా కనిపిస్తున్నారు. పాటలో వీళ్ళిద్దరి గెటప్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు అంటే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పాటల్లో సెట్టింగ్స్, లొకేషన్స్, హీరో హీరోయిన్స్ వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఈ పాటలో కూడా అలాగే ఉన్నాయి. ఒక సందర్భంలో రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ మీద కియారా అద్వానీ ఫోటోలు ఉన్నాయి. ఇలాంటి ఐడియాలు శంకర్ కి తప్ప మరి ఎవరికి కూడా రావు ఏమో.

ఈ పాట చాలా సార్లు విడుదల చేద్దాం అనుకొని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది. అందుకే అదే రోజు ఈ పాటని విడుదల చేశారు. విడుదల చేసిన కొంతసేపటికే ఈ పాటకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాటలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో లిరికల్ వీడియో కాబట్టి అందులో పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. ఇందులో సర్ప్రైజ్ అనే పదం స్పెల్లింగ్ తప్పు రాసారు. SURPRISE అని రాయడానికి బదులుగా SUPPRISE అని రాసారు. దాంతో ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Previous article”లిఫ్ట్స్” లో ఎందుకు అద్దాన్ని పెడతారు..? దాని వెనుక కారణాలు ఇవే..!
Next articleమెహందీ ఫంక్షన్ ప్రాముఖ్యత ఏమిటి…? పెళ్లికి ముందు ఎందుకు చెయ్యాలి..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.