Ads
జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇది వరకు తక్కువ వయసులో ఉన్నప్పుడే ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఈ కాలంలో ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం ఎక్కువ చదువుకోవడం వలన పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. 25 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తే ఆడపిల్లలకి ఏమవుతుంది అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి.
ఇంచుమించుగా ఈ మధ్య 25 ఏళ్ల తర్వాతనే ఎక్కువ మంది ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. సైన్స్ కూడా అదే మంచిదని అంటోంది. 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. ఎందుకు అది మంచిది అనేది తెలియని వాళ్ళు తప్పక చూడండి.
#1. మనకి వయసు పెరిగిన తర్వాత ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. సర్వే ఏం చెబుతోంది అంటే 25 తర్వాత పెళ్లి చేసుకుంటే ఆర్థిక స్వతంత్రం ఉంటుందట దాంతో ఎక్కడైనా సరే ఆడపిల్లలు బతకగలరు.
2. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే కచ్చితంగా ధైర్యం ఉంటుంది. అలానే ఆర్థిక స్వతంత్రం కూడా మీకు ఉంటుంది.
3. మంచిగా ఆలోచించడానికి కూడా అవుతుంది. 25 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే మానసిక బలంగా కూడా మీకు ఉంటుంది.
4. మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మంచి, చెడు గురించి మీకు మరొకరు చెప్పక్కర్లేదు మీకే మంచి చెడు మధ్య తేడా తెలుస్తుంది.
Ads
5. సొసైటీ ని కూడా సులభంగా ఎదుర్కోవడం మీకు తెలుస్తుంది.
6. సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. దేనికి భయం ఉండదు. చెడుని ఎదిరించడానికి అవుతుంది.
7. గట్టిగా మీరు అనుకున్నది చెప్పొచ్చు.
8. వయసు పెరిగే కొద్దీ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు అలానే 9. మీ భాగస్వామిని కూడా మీరు బాగా అర్థం చేసుకోగలరు.
10. కానీ చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వలన సరిగా ఆలోచించడానికి గట్టిగా మాట్లాడటానికి కుదరదు. ధైర్యం కూడా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు కూడా పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి.