Ads
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.
ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా సరే ఆ స్థానం అంత సులభంగా రాదు. మధ్యలో కొన్ని ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రతన్ టాటా గారికి కూడా ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది. అందుకు రతన్ టాటా గారు కూడా దానికి తగిన జవాబు ఇచ్చారు. 1999 లో టాటా కంపెనీ వాళ్ళు మొదలుపెట్టిన కార్ల వ్యాపారం అంత పెద్దగా సాగకపోవడంతో వాళ్లు తమ బిజినెస్ ని అమ్మేద్దాం అనుకున్నారు. దీనికి ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు.
ముంబై లో ఉన్న టాటా కంపెనీ హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత ఫోర్డ్ సంస్థ బిజినెస్ ని కొనడానికి ఆసక్తి కనబరచింది. కానీ రతన్ టాటా తన టీం తో కలిసి డెట్రాయిట్ కి వెళ్ళినప్పుడు ఫోర్డ్ కంపెనీ బృందం వాళ్ళని అంత బాగా ట్రీట్ చేయలేదు. మీటింగ్ మూడు నాలుగు గంటల పాటు జరిగిందట. కానీ మీటింగ్ లో వాళ్లు మాట్లాడిన మాటలు అవమానపరిచినట్లు అనిపించాయి.
Ads
అంతే కాకుండా “అసలు మీకు ఏమీ తెలియనప్పుడు ప్యాసెంజర్ కార్ డివిజన్ ఎందుకు స్టార్ట్ చేశారు?” అని అడిగారట. వాళ్ళ కార్ డివిజన్ కొనుక్కొని ఫేవర్ చేస్తామని చెప్పారట. మీటింగ్ అయిపోయిన. తర్వాత టీమ్ అంతా కలిసి ఇ న్యూ యార్క్ కి తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నారట. 90 నిమిషాల ఫ్లైట్ ప్రయాణంలో రతన్ టాటా చాలా డల్ గా ఉన్నారట.
అయితే 2008 లో టాటా మోటార్స్ సంస్థ, గ్లోబల్ ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ (ఆర్థిక మాంద్యం) వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఫోర్డ్ కంపెనీ వాళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్స్ ని 2.3 బిలియన్ల కి కొనుక్కున్నారు. అప్పుడు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారికి థ్యాంక్యూ చెప్పి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుక్కొని చాలా పెద్ద ఫేవర్ చేశారు అని అన్నారట. ఇలా రతన్ టాటా గారికి స్వీట్ రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది అని అంటూ ఉంటారు.