Ads
ఇటీవల కాలంలో మలయాళంలో హిట్ అయిన సినిమాలను ఎక్కువగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో రిలీజ్ అయ్యి, అద్భుతమైన ప్రేక్షక ఆదరణ పొందిన సూపర్ హిట్ మూవీ ‘నాయట్టు’ ను తెలుగులో రీమేక్ చేశారు.
Ads
చాలాకాలం క్రితమే ఈ మూవీ మొదలైనప్పటికీ, ఈ సినిమాని తెలుగులో కోటబొమ్మాళి పీఎస్ పేరుతో రీమేక్ చేశారు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ మూవీలో నటించారు. ఇప్పుడు నాయట్టు సినిమాని తెలుగులో ఆహాలో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ మూవీ ‘నాయట్టు’ కథ ఏమిటో? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
నాయట్టు సినిమా పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కింది. కుంచకో బోబన్ , జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జాఫర్ ఇడుక్కి , అనిల్ నెడుమంగడ్, హక్కిం షాజహాన్ కీలక పాత్రల్లో నటించారు. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీకి మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకి ఉత్తమ సినిమాగా, ఉత్తమ నటుడిగా జోజు జార్జ్, ఉత్తమ కథ మరియు ఉత్తమ ఎడిటర్ గా ఆ ఏడాది కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వచ్చాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ. రాష్ట్రంలో ఎన్నికల జరిగే సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక ఎస్సై, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌కు, ఒక వర్గానికి చెందిన మనుషుల మధ్య పోలీస్ స్టేషన్ లో చిన్న గొడవ జరుగుతుంది. అయితే ఆ గోడవకు పాలిటిక్స్ తోడవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఈ పరిస్థితుల్లో ఎస్సై మరియు కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న జీపు మోటార్ బైక్ ను ఢీకొడుతుంది. దాంతో బైక్ మీద ఉన్న వ్యక్తి మరణిస్తాడు. అయితే అతను బిజు అనే లోకల్ గూండా స్నేహితుడు. దాంతో జీపులోని ముగ్గురిని అరెస్ట్ చేసి, మర్డర్ కేసు పెట్టమని ఆదేశాలు వస్తాయి. దాంతో ఎస్పై, ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడి నుండి తప్పించుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.