Ads
దాదాపు 20 సంవత్సరాలు సినిమాలు చేసి, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ నటించిన ఒక సినిమా ఇటీవల ఆహాలో విడుదల అయ్యింది. ఇది తమిళ్ సినిమా అయినా కూడా, తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. కరుంగాపియం అనే సినిమాని తెలుగులో కాజల్ కార్తీక పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఇందులో కార్తీక అనే పాత్రని కాజల్ అగర్వాల్ పోషించారు. ఆరు కథలని కలిపి ఒక సినిమాగా రూపొందించారు. ఇందులో కాజల్ కేవలం 20 నిమిషాలు కనిపిస్తారు.
కానీ సినిమాలో బలమైన పాత్ర కూడా కాజల్ అగర్వాల్ ది ఉంటుంది. రెజీనా కసాండ్రా మరొక ముఖ్య పాత్రలో నటించారు. ఒక పుస్తకంలో రాసిన విషయాలు అన్నీ కూడా నిజం అవుతూ ఉంటాయి. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది అనేది మిగిలిన కథ. చాలా కథలు హారర్ నేపథ్యంలోనే సాగుతాయి. జనని అయ్యర్ నటించిన కథ మాత్రం పెద్దగా అర్థం కాదు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కథ కూడా బలంగా అనిపించదు. రెజీనా కథ పారలల్ గా నడుస్తూ ఉంటుంది.
Ads
రెజీనా పోషించిన ఉమాదేవి పాత్రకి, కాజల్ పోషించిన కార్తీక పాత్రకి ఎలాంటి సంబంధం ఉంది అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. భవిష్యత్తు చూడగలిగే ఒక వ్యక్తి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఎదుర్కొనే సంఘటనలని ఎమోషనల్ గా చూపించారు. సినిమాలో కొన్నిచోట్ల సాగదీసినట్టు అనిపించినా కూడా, కొంత వరకు సినిమా బాగానే అనిపిస్తుంది. సినిమా ఎండింగ్ ప్రశ్నార్ధకంగా వదిలేసి ఎండ్ చేశారు.
ఆ ప్రశ్నకి సమాధానం ప్రేక్షకులనే ఆలోచించమన్నట్టు వదిలేశారు. అయితే సినిమాలో హారర్ సీన్స్ అంత కొత్తగా అనిపించవు. కామెడీ కూడా అంత పెద్దగా నవ్వు తెప్పించే విధంగా ఉండదు. ఆరు కథలు ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రమే సీన్స్ బాగా రాసుకున్నట్టు అనిపిస్తాయి. కాజల్ పోర్షన్ తప్ప మిగిలిన ఏమి కూడా పెద్ద బలంగా అనిపించవు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఈ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
ALSO READ : ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన టిఫిన్ ధరలు ఎంతో తెలుసా..? దోస ఖరీదు ఎంతంటే..?