Ads
తమిళ సినిమాల ద్వారానే తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్న నటుడు విశాల్. విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా వస్తోంది అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. విశాల్ నటించిన రత్నం సినిమా గతవారం విడుదల అయ్యింది. ఈ సినిమాకి హరి దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్ లో గతంలో భరణి, పూజ సినిమాలో వచ్చాయి. ఇప్పుడు ఇది మూడవ సినిమా. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రియా భవాని శంకర్ ఇందులో హీరోయిన్ గా నటించారు.
ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1994 లో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి టైం లైన్ కి వచ్చేస్తుంది. అక్కడ ఉండే నాయకుడు ఎమ్మెల్యే పన్నీర్‌స్వామి(సముద్రఖని) కి రైట్ హ్యాండ్ గా పని చేస్తూ ఉంటాడు రత్నం (విశాల్). రత్నం తల్లి రంగనాయకి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ తర్వాత రత్నం జీవితంలోకి మల్లిక (ప్రియా భవాని శంకర్) వస్తుంది. మల్లిక చూడడానికి రత్నం తల్లి రంగనాయకి లాగానే ఉంటుంది. కానీ మల్లికని కొంత మంది చంపాలి అని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సినిమా పాత ఫార్మాట్ లో నడుస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి టెంప్లేట్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయి.
Ads
కాబట్టి సినిమా కొత్తగా అనిపించదు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాని కాపాడటానికి తన శక్తి అంతా పెట్టి కృషి చేశారు. నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ఎమోషన్స్ సినిమాలో చూపించడానికి ప్రయత్నించారు. కానీ ఒక్క పాత్ర కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. దాంతో వాళ్ళు ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అర్థం కావు. యాక్షన్ సీన్స్ బాగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అంత పెద్దగా తెర మీద కనిపించదు. వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యే ఎమోషన్స్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే రత్నం సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమా గా నిలుస్తుంది. సినిమా కథ మాత్రం తెలిసినట్టుగానే అనిపిస్తుంది.