ఆహాలో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

Ads

ప్రతివారం ఆహాలో కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. గత వారం కూడా ఇందులో అలాగే ఒక కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు హ్యాపీ ఎండింగ్. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా, ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, యష్ పూరి, అపూర్వ రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, హర్ష్ (యష్ పూరి) చదువుకునే రోజుల్లో చేసిన ఒక పని వల్ల తను ఏ అమ్మాయి గురించి తలుచుకుంటే వాళ్ళు చనిపోయే శాపం కలుగుతుంది.

happy ending aha movie review telugu

అవని (అపూర్వ రావు) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. స్టోరీ లైన్ డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో కొంత భాగం వరకు కూడా అంతే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అయితే టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి స్కోప్ ఉంది. కానీ దర్శకుడు సినిమాని సీరియస్ గా చెప్పడానికి ప్రయత్నించారు. సీన్స్ వచ్చే ఫ్లో కూడా మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా సాగదీసినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ తమకి ఇచ్చిన పాత్రలో బాగానే నటించారు.

Ads

ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కూడా మనకు తెలిసిన కొంత మంది నటించారు. వాళ్లు కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. రవి నిడమర్తి అందించిన పాటలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఎందుకంటే, దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఇటీవల వచ్చిన సినిమాలతో పోలిస్తే కొత్తగా ఉంది. అందుకే టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే స్టోరీ పాయింట్ తెర మీద ఇంకా బాగా కనిపించేది. ప్రేక్షకులకు ఇంకా బాగా అర్థం అయ్యేది.

ALSO READ : హీరో గోపీచంద్ నాన్న దర్శకత్వం చేసిన సినిమాలు ఏమిటో తెలుసా?

Previous articleహీరో గోపీచంద్ నాన్న దర్శకత్వం చేసిన సినిమాలు ఏమిటో తెలుసా?
Next articleనరేంద్ర మోడీ భార్య గురించి ఈ విషయాలు తెలుసా..? అసలు వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.