Ads
తెలుగు సంస్కృతిని కాపాడుకోవడం అనేది తెలుగు వాళ్ళ బాధ్యత. మనవారికి గర్వకారణం అయిన మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ల గురించి ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత కూడా తెలుగు వారిదే. కానీ అలాంటి ఒక వ్యక్తి గురించి బాలీవుడ్ వాళ్లు బయోపిక్ తీశారు. అసలు మనవాళ్లు ఏం చేస్తున్నారు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కమర్షియల్ సినిమాల వైపే యంగ్ హీరోలు కూడా వెళ్లడం అనేది చర్చనీయాంశం అయిన అంశంగా మారింది. శ్రీకాంత్ బొల్ల. ఈ వ్యక్తి కొంత మందికి తెలుసు. కొంత మందికి తెలియకపోవచ్చు.
అలాంటి వారి కోసం ఇతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాంత్ బొల్ల ఒక పారిశ్రామికవేత్త. బొల్లంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు. శ్రీకాంత్ జులై 7వ తేదీన, 1991లో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలోని సీతారామపురంలో జన్మించారు. తన తల్లిదండ్రులకు శ్రీకాంత్ మొదటి బిడ్డ. శ్రీకాంత్ కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. శ్రీకాంత్ కి పుట్టుకతోనే దృష్టిలోపం ఉంది. శ్రీకాంత్ చిన్నప్పటి నుండి కూడా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నారు. శ్రీకాంత్ తన మెట్రిక్యులేషన్ తర్వాత సైన్స్ చదవాలి అని అనుకున్నారు. కానీ శ్రీకాంత్ కి అనుమతి ఇవ్వలేదు. దాంతో శ్రీకాంత్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఆరు నెలల గడువు తర్వాత శ్రీకాంత్ ఇంటర్ చదువుకున్నారు.
Ads
12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ లో 98 శాతంతో ఉత్తీర్ణులు అయ్యారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో శ్రీకాంత్ దృష్టిలోపం కారణంగా అడ్మిషన్ నిరాకరించారు. అప్పుడు శ్రీకాంత్ ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అక్కడ డిగ్రీ పొందిన మొదటి అంతర్జాతీయ చూపులేని విద్యార్థిగా శ్రీకాంత్ అయ్యారు.
శ్రీకాంత్ 2012 లో బొల్లంట్ ఇండస్ట్రీస్ అనే ఒక అరేకా చెట్టు నుండి ఉత్పత్తులను తయారు చేసే ఇండస్ట్రీ రూపొందించారు. ఇందులో ఎంతో మంది వికలాంగులకు ఉపాధి కల్పించారు. రతన్ టాటా దీనికి ఫండింగ్ చేశారు. సగటున 20 శాతం గ్రోత్ తో 2018లో ఈ కంపెనీ 150 కోట్ల టర్నోవర్ సాధించింది. శ్రీకాంత్ 2022 లో వీర స్వాతిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ నైనా అనే కూతురు కూడా ఉంది. ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి మీద తుషార్ హీరానందాని దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు హీరోగా శ్రీకాంత్ పేరు మీద సినిమా వచ్చింది. జ్యోతిక కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. దాంతో తెలుగు వాళ్ళు ఈ వ్యక్తి మీద ఇంకా ఎందుకు సినిమా తీయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.