Ads
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కాగా, పవర్ స్టార్ తన కెరీర్లో కొన్ని చిత్రాలను మధ్యలోనే నిలిపివేశారు. ఆ సినిమాలలో సత్యాగ్రహి ఒకటి.
Ads
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పవన్ సరసన భూమిక నటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్.జె.సూర్య, పవన్ కళ్యాణ్ చిన్ననాటి మిత్రుడైన ఏ.ఎం.రత్నం నిర్మాత. ఈ విజయం తరువాత పవన్ తో వరుస చిత్రాలు నిర్మించాలని ఏ.ఎం.రత్నం అనుకున్నారు. దాంతో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో పవన్ హీరోగా ‘సత్యాగ్రహి’ సినిమాను ప్రకటించారు.అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, హీరో వెంకటేష్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. దర్శకుడు వి.వి.వినాయక్ తొలి షాట్ కి డైరెక్షన్ చేసారు. ఆ తరువాత ఆ సత్యాగ్రహి మూవీని పక్కన పెట్టేశారు. ఆ మూవీ ఎందుకు ఆగిందనే కారణాలు బయటికి రాకపోయినా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీని ఆపేసారని గుసగుసలు వినిపించాయి. మూవీ స్క్రిప్టు సరిగ్గా లేదని, మూవీ బడ్జెట్ చాలా ఎక్కువైందని, మీడియా ఈ సినిమా ఆగిపోవడం పై రకరకాల వార్తలు రాయడం అప్పట్లో సంచలనమైంది.ఒక దశలో ఇద్దరి స్నేహం చెడిందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం పై ఇటీవల ప్రొడ్యూసర్ ఎఎమ్ రత్నం ‘ఖుషీ’రీరిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడారు. సత్యాగ్రాహి స్టోరీ పొలిటికల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. ఈ మూవీకి పవన్ కల్యాణ్ దర్శకత్వం చేయాలని అనుకున్నారు. అయితే ఆ టైమ్ లో విడుదలైన ‘జానీ’ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన డైరెక్షన్ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయిందని, దానివల్లే ‘సత్యాగ్రహి’ మూవీని నిలిపివేశసామని, పవన్ ఎప్పుడూ డబ్బులు మాత్రమే పోగేసుకోవాలని అనుకోలేదని నిర్మాత ఏం.ఎం.రత్నం తెలిపారు.
Also Read:మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్లాప్ టాక్ తెచ్చుకొని, ఆ తరువాత హిట్ అయిన 8 చిత్రాలు ఇవే..