Ads
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ వరల్డ్ వైడ్ గా ఆదరణ పొందిన విషయం అందరికి తెలిసిందే. కేజిఎఫ్ 2018లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 అన్ని భాషల్లోనూ రికార్డులను బ్రేక్ చేసింది.
Ads
రాకింగ్ స్టార్ యష్ నటన, పవర్ఫుల్ పొలిటీషియన్ గా నటించిన రవీనా టాండన్ యాక్టింగ్, విలన్ గా సంజయ్‌దత్ నటన, ప్రకాష్ రాజ్ నటించిన సన్నివేశాలు, సీబీఐ ఆఫీసర్‌గా చేసిన రావు రమేష్ పాత్రకు ఆడియెన్స్ నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే వీటన్నిటితో పాటుగా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవడానికి మరో కారణం మదర్ సెంటిమెంట్. దీనికి ఆడియెన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ పాత్రలో అద్భుతంగా నటించిన ఆ నటి గురించి తెలుసుకుందాం.కేజిఎఫ్ సిరీస్‌లో రాఖీభాయ్ తల్లి పాత్రను పోషించిన నటి పేరు అర్చన జోయిస్. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అర్చన జోయిస్ ది హీరో యష్ కంటే చాలా చిన్న వయసు. యశ్ వయస్సు 36 ఏళ్లు కాగా, ఆయన తల్లిగా నటించిన అర్చన జోయిస్ వయస్సు 27 ఏళ్ళే, అంటే యశ్ కన్నా అర్చన 9 సంవత్సరాలు చిన్నది. అయినా కూడా తల్లి పాత్రలో నటించి అందరిని ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో రాఖీభాయ్ కు బాల్యంలో మాత్రమే వచ్చే తల్లి పాత్ర కావడంతో ఈ పాత్రకు అర్చనను ఎంపిక చేశారు.ఆమె వ్యక్తిగత విఇవరాల్లోకి వెళ్తే, ఆమె 1994లో బెంగళూరులో జన్మించారు. అర్చన కర్ణాటక నృత్యకారిణి, అంతేకాకుండా ఆమెకు సంస్కృత భాష పై మంచి అవగాహన ఉందని తెలుస్తోంది. తమిళనాడులో ఫైన్ ఆర్ట్స్ లో పీజీని పూర్తి చేసారు. మహాదేవి అనే కన్నడ సీరియల్ లో అర్చన మొదటిసారిగా నటించింది. సుందరి అనే పాత్రలో నటించి ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఆ తరువాత కేజిఎఫ్ సినిమాలో అవకాశం రావడంతో రాఖీభాయ్ కి తల్లిగా నటించి సిని జీవితాన్ని ప్రారంభించింది. అర్చనా ఫోటోలు సోషల్ మీడియాలో ష్కరు చేస్తున్నాయి. వీటిని చూసిన వారు రాఖీభాయ్ తల్లి ఇంత బాగుంటుందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అర్చనకి చాలా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.
Also Read: రజనీకాంత్ శివాజీ సినిమాలోని అక్కమ్మ, జక్కమ్మలు బయట ఎలా ఉంటారో తెలుసా?