ఎట్టకేలకి OTT లోకి వచ్చిన సుహాస్ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?

Ads

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు హీరోగా ఎదిగారు సుహాస్. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం ఇప్పుడు అహలో స్ట్రీమ్ అవుతోంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సూర్య సుహాస్ ఆర్జే గా పనిచేస్తూ ఉంటాడు ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులని కోల్పోతాడు. అదే ప్రమాదంలో సూర్య తలకి దెబ్బ తగులుతుం.ది ఆ గాయంలో సూర్యకి ఎదుటి వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టలేని డిజార్డర్ వస్తుంది. దాన్ని ఫేస్ బ్లైండ్ నెస్ డిసార్డర్ అని అంటారు. ఒకరోజు సూర్య కళ్లెదురుకుండానే అమృత (సాయి శ్వేత) అనే ఒక అమ్మాయిని లారీ కిందకు తోసి చంపేస్తారు.

Ads

ముఖాలు సరిగ్గా కనిపించని కారణంగా సూర్య ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయం తెలుసుకోలేకపోతాడు. కానీ ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అని అనుకుంటాడు. తర్వాత సూర్య ఏం చేశాడు? అసలు అమృతని ఎవరు చంపారు? అమృతని చంపిన వాళ్ళని సూర్య పట్టుకున్నాడా? సూర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమా కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. తెర మీద కూడా అంతే కొత్తగా సినిమాని ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా నడుస్తుంది. సూర్య జీవితాన్ని ఇందులో చూపిస్తారు. సూర్య ఒక అమ్మాయిని ప్రేమించడం, కొన్ని కామెడీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కథ మొదలవుతుంది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కానీ ఎమోషన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుహాస్ డిఫరెంట్ పాత్రలని ఎంచుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక డిఫరెంట్ పాత్ర పోషించారు. తన పాత్రలో సుహాస్ బాగా నటించారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా తనకి ఇచ్చినంత వరకు బాగా చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు బాగున్నాయి. ఎస్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ గా నిలిచింది. సినిమా స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కొన్ని సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి.

Previous articleఅమ్మాయిలూ… 25 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా.? అయితే జరిగేది ఇదే.!
Next articleSAMANTHA: ఇదేందయ్యా ఇది..”సమంత” ఈ హీరోతో ఎప్పుడు నటించింది.? ఈ సినిమా ఎప్పుడొచ్చింది?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.