“కీర్తి సురేష్” తో పాటు… “అనిరుధ్ రవిచందర్” రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చిన 5 మంది హీరోయిన్స్..!

Ads

చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు అనిరుధ్ రవిచందర్. అనిరుధ్ రవిచందర్ రజనీకాంత్ కి మేనల్లుడు అవుతారు అనే సంగతి తెలిసిందే. అందుకే ముందుగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమాతోనే ఒక కొత్త రకమైన మ్యూజిక్ అందించారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూ వెళ్లాయి.

anirudh ravichander relationship

అజ్ఞాతవాసి సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన పాటలకు ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అసలు రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ సినిమాతోనే అనిరుధ్ రవిచందర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి. కానీ ఆ సినిమా చేయలేకపోయారు. కారణాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అజ్ఞాతవాసి తర్వాత, జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలకి కూడా సంగీత దర్శకత్వం వహించారు.

ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. వీటితో పాటు, తమిళ సినిమాలకి సంగీతం అందిస్తున్నారు. గత సంవత్సరం షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిన విషయమే. అనిరుధ్ రవిచందర్ కూడా కొంత మంది హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Ads

#1 ప్రియా ఆనంద్

హీరోయిన్ ప్రియా ఆనంద్ మనందరికీ తెలుసు. అనిరుధ్ రవిచందర్, ప్రియా ఆనంద్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అని చెప్పారు.

#2 కీర్తి సురేష్

ఒక సమయంలో అనిరుధ్, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయం మీద ఎంత వరకు నిజం ఉంది అనేది ఎవరికి తెలియదు.

#3 జోనిత గాంధీ

సింగర్ జోనిత గాంధీ ఎన్నో మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించారు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు కూడా పాడారు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్టు గత కొంత కాలం నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

#4 ఆండ్రియా

సింగర్, నటి ఆండ్రియాతో అనిరుధ్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఒకసారి అనిరుధ్ బహిరంగంగానే తెలిపారు. ఆండ్రియా కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ అనిరుధ్ ఆలోచన విధానం ఇంకా ఎదగాలి అని అన్నారు.

#5 శృతి హాసన్

అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన మొదటి సినిమాలో హీరోయిన్ శృతి హాసన్. వీళ్ళిద్దరూ అప్పుడు ప్రేమలో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనిరుధ్ మాన్ కరాటే అనే ఒక సినిమాలో శృతి హాసన్ కి పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఈ విషయం గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడలేదు.

ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది కేవలం వాళ్లకి మాత్రమే తెలుసు. కానీ వీళ్ళ మీద మాత్రం వార్తలు వచ్చాయి. వీటి గురించి ఎవరు స్పష్టత ఇవ్వాలి అని కూడా అనుకోలేదు. మాట్లాడడం కూడా సమయం వృధా చేయడం అని అనుకున్నారు.

Previous articleఅర్ధరాత్రి 2 గంటలకి నిద్ర లేపి భార్య అడిగిన ప్రశ్నకి భర్త నోట మాట రాలేదు..! అదేంటో తెలిస్తే నవ్వాపుకోలేరు..!
Next articleబాలకృష్ణ… ఒక మంచి నటుడు మాత్రమే కాదు… మంచి వ్యక్తి కూడా..! ఉదాహరణ ఇదే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.