“చంద్రబాబు నాయుడు” పై వైయస్ షర్మిల పోస్ట్..! ఏం అన్నారంటే..?

Ads

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎంతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. మరొక పక్క, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 70 వేల కోట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో కూడా సంబరాలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, గొడవలకి ఇది సమయం కాదు అని చెప్పారు.

వీరందరినీ అభినందిస్తూ ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి అభినందనలు తెలుపుతున్నారు. అయితే షర్మిల కూడా ఈ విషయం మీద స్పందించారు. వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ఈ విషయం మీద మాట్లాడారు. షర్మిల ఇవాళ ఈ విషయం గురించి మాట్లాడారు. ఈ విషయంపై షర్మిల మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి.”

Ads

“రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది.” అని రాశారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ కి కూడా షర్మిల అభినందనలు తెలిపారు.

Previous articleజరిగిందే మళ్లీ మళ్లీ జరిగితే… గెలిచేది ఎవరు..? ఈ సినిమా చూశారా..?
Next articleచూడాలని ఉంది నుంచి… భోళా శంకర్ వరకు… కోల్‌కతా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన మూవీస్…
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.