Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే, సెట్టింగ్స్ కోసం మొదటిగా గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ. భారీ సెట్టింగ్స్ వేయాలి అంటే చాలా స్థలం కావాలి, అందుకు సహకరించే ప్రదేశం మనకి దగ్గరలో ఉండాలి అని గతంలో చాలా మంది అనుకునేవారు. అలాంటి ఆలోచనని నిజం చేసింది రామోజీ ఫిలిం సిటీ. తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా, ఎన్నో భాషల్లో రూపొందిన ఎన్నో సినిమాలని ఇక్కడ షూట్ చేశారు. చేస్తూనే ఉంటారు. రామోజీ ఫిలిం సిటీ మన ఇండస్ట్రీలో ఉండడం అనేది మనకి గర్వకారణం.
అలాగే, ఈటీవీ, ఈనాడు పేపర్లతో ఉన్న బంధం ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నది. ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలకి పునాది వేశారు రామోజీరావు గారు. ఆయన లేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలని రామోజీరావు గారు చేసి చూపించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్నో లక్షల మందికి ఉపాధి ఇచ్చారు. ఎన్నో వ్యాపారాల్లో తనదైన శైలిలో కొత్త ఐడియాలతో తనదైన ముద్ర వేసుకున్నారు.
Ads
రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు. ఎంతో మంది నటులకి, నిపుణులకి అవకాశం ఇచ్చారు. వాళ్లలో ఇవాళ గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రామోజీరావు గారు కూడా ఒక సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు. చాలా సంవత్సరాల క్రితం రామోజీరావు గారు ఒక సినిమాలో నటించారు. అది కూడా అతిధి పాత్రలో నటించారు.
రామోజీరావు గారు ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించినా కూడా సినిమా పోస్టర్స్ లో ఆయన ఫోటో కూడా వేశారు. ఆ సినిమా పేరు మార్పు. యు విశ్వేశ్వర రావు గారు నిర్మించిన మార్పు సినిమాలో ఒక న్యాయమూర్తి పాత్రలో రామోజీరావు గారు నటించారు. ఈ సినిమా 1978 లో విడుదల అయ్యింది. రామోజీరావు గారికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. రామోజీరావు గారు తన చిన్న వయసులో నాటకాలు వేశారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఒక మనిషికి ఆశయం ఉంటే ఏదైనా సాధించగలరు అనే దానికి నిదర్శనంగా రామోజీరావు గారు నిలిచారు.