Ads
బయోపిక్ అనే ఒక ట్రెండ్ మొదలుపెట్టిన సినిమా మహానటి. ఆ సినిమాకి ముందు కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా హిట్ అవ్వడంతో, తర్వాత బయోపిక్ సినిమాలు రావడం పెరిగాయి. సాధారణంగా అయితే బయోపిక్ అంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ వాళ్లు. వాళ్లు నిజ జీవిత కథల ఆధారంగా ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటికి కూడా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో, ముఖ్యంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ధైర్యం చాలా తక్కువ మంది చేస్తూ వచ్చారు.
కానీ ఎప్పుడైతే మహానటి సినిమా విడుదల అయ్యి, అని అవార్డులు సాధించిందో, అప్పటి నుండి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీయడం అనేది సాధారణమైన విషయం అయిపోయింది. చాలా మంది నటుల మీద, లేదా దేశం కోసం ఏదో ఒకటి చేసిన వారి మీద బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. ఈ పైన ఫోటో కూడా అలాంటి ఒక బయోపిక్ సినిమాలోది. ఇందులో ఉన్న హీరోయిన్ మధుబాల అని మీకు అర్థం అయ్యి ఉంటుంది. హీరో కూడా మనందరికీ తెలిసిన వారే.
Ads
అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఒక ఎవర్ గ్రీన్ సినిమా. ఈ హీరో అరవింద్ స్వామి. గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది కదా? ఎందుకంటే ఈ సినిమాలో అరవింద్ స్వామి తన పాత్ర తాను పోషించలేదు. ఒక ప్రముఖ నటుడిగా తను నటించారు. ఈ స్టిల్ జయలలిత గారి బయోపిక్ గా రూపొందిన తలైవి సినిమాలోనిది. ఇందులో ఎంజీఆర్ గారి పాత్రలో అరవింద్ స్వామి నటించారు. అరవింద స్వామికి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఇప్పటికి కూడా ఉన్నారు. ధ్రువ సినిమా వచ్చినప్పుడు రామ్ చరణ్ పాత్రతో పాటు అరవింద్ స్వామి పాత్రకి కూడా మంచి ప్రశంసలు అందాయి. ఇటీవల అరవింద్ స్వామి తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో నటించారు.
తలైవి సినిమా కోసం తన గెటప్ పూర్తిగా మార్చుకున్నారు. కొన్ని ఫోటోల్లో అయితే అచ్చం ఎంజీఆర్ గారి లానే కనిపించారు. అంత జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సినిమాలో అరవింద్ స్వామి నటనకి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం అరవింద్ స్వామి ఆర్జే బాలాజీ హీరోగా నటిస్తున్న సింగపూర్ సెలూన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా, కార్తీ హీరోగా నటిస్తున్న మెయ్యళగన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.