Ads
సినిమాలు అంటే 3 గంటలపాటు అలరించడం మాత్రమే కాదు. సినిమా చూసాక చాలా కాలం పాటు అది ప్రేక్షకులకి గుర్తుండాలి. అలాంటి సినిమాలని బెస్ట్ సినిమాలు అంటారు. అలా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఒక సినిమా ఇది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా పేరు అప్పట్లో ఒకడుండేవాడు. శ్రీవిష్ణు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 లో వచ్చింది. ప్రశాంతి, కృష్ణ విజయ్ ఈ సినిమాని నిర్మించారు. తాన్యా హోప్, సాషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. హీరో సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపిస్తారు.
Ads
రైల్వే రాజు అనే పాత్రలో శ్రీవిష్ణు నటించారు. క్రికెటర్ అవ్వాలని ఆశయం ఉండే పాత్ర ఇది. ఇంతియాజ్ అలీ అనే పాత్రలో నారా రోహిత్ నటించారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించారు. వీరు ఎదుర్కొనే సంఘటనల ఆధారంగానే ఈ సినిమా నడుస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా విడుదల అయ్యింది. కానీ ఎంతో పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ బాగా వచ్చాయి. టాక్ కూడా బాగా వచ్చింది. కానీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ఆదరణ లభించాలి అని అందరు అనుకుంటూ ఉంటారు. జెర్సీ అంత గుర్తింపు లభించాల్సిన సినిమా ఇది అని సోషల్ మీడియాలో చాలా మంది ఈ సినిమా గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే చాలా సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. ఎంతో మంది క్రిటిక్స్ కూడా ఈ సినిమాని పొగిడారు. ఒక కొత్త దర్శకుడు ఇంత మంచి సినిమాని తీయడం, ఇంత గొప్పగా దాన్ని తెరకెక్కించడం అనేది ఎంతో అభినందించాల్సిన విషయం అంటూ చాలా మంది సాగర్ కె చంద్రని పొగిడారు. క్రిటిక్స్ మాత్రమే కాదు. ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసాక చాలా మంచి సినిమా అంటూ కామెంట్స్ చేసారు.