Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత, ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళిపోయారు రకుల్ ప్రీత్ సింగ్. గత కొంత కాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ కి సరైన హిట్స్ లేవు. కొన్ని సినిమాలు చేశారు కానీ అందులో నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు కాదు. ఒకవేళ నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు చేసినా కూడా అవి అంత పెద్ద గొప్ప పాత్రలు కావు. సాధారణంగానే బాలీవుడ్ లో కాంపిటీషన్ ఎక్కువ. అక్కడ యాక్టింగ్ లో రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో గుర్తింపు సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు.
Ads
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు కూడా లేవు. కొంత కాలం క్రితం రకుల్ ప్రీత్ సింగ్ తాను ప్రేమించిన జాకీ భాగ్నానిని పెళ్లి చేసుకున్నారు. వీరికి పూజ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఉంది. ఈ పూజ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఎన్నో సినిమాలని నిర్మించారు. ఇటీవల వీరి నిర్మాణం నుండి బడే మియా చోటే మియా సినిమా వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. గతంలో వచ్చిన సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో పూజ ఎంటర్టైన్మెంట్స్ కి 250 కోట్ల అప్పు పడింది అని సమాచారం. పూజ ఎంటర్టైన్మెంట్స్ లో పనిచేస్తున్న 80 శాతం మంది ఉద్యోగులకి జీతాలు సరిగ్గా చెల్లించలేదు.
గత కొన్ని నెలల నుండి కూడా వారికి జీతాలు అందలేదు. పూజ ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ ని జాకీ భాగ్నాని అమ్మేశారు. ఇది మొత్తంగా 7 అంతస్తులు ఉంటుంది. మరొక పక్క, రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ, ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ షోస్ చేయడం మాత్రమే కాకుండా, ఒక రెస్టారెంట్ కూడా మొదలుపెట్టారు. రకుల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భారతీయుడు 2 కాగా, మరొకటి దేదే ప్యార్ దే 2 అని మరొక సినిమా. ఇది కూడా ఒక సీక్వెల్ సినిమా. ప్రస్తుతం అయితే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.