ప్రభాస్ ఎంత కవర్ చేయడానికి చూసినా… ఇబ్బంది తెలిసిపోయింది..! సలార్ సినిమాలో ఇది గమనించారా..?

Ads

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ సలార్‌. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత సంవత్సరం రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. 700 కోట్ల రూపాయలకు  పైగా వసూళ్లు సాధించి ప్రభాస్‌ రేంజ్ ను మరోసారి నిరూపించింది.

థియేటర్లలో విడుదల అయ్యి నెల రోజులు కాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 20 అర్ధరాత్రి నుండి  ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది ఇలా ఉంటే సలార్ మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

 

రెబల్ స్టార్ ప్రభాస్,  శ్రుతి హాసన్‌ జంటగా నటించిన సలార్ మూవీలో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  కీలక పాత్రలో నటించాడు. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, టినూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు నటించారు. ప్రభాస్ గత చిత్రాలలో ఫైట్స్ మరియు డాన్సులతో ఫ్యాన్స్ ని అలరించేవాడు. అయితే ప్రభాస్ గత కొంతకాలం నుండి డ్యాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు చేయడం లేదు. అందుకు కారణం పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే కాదు, మోకాలినొప్పి సమస్య.

Ads

సలార్ మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ స్లో మోషన్ షాట్స్ ఉపయోగించారని తెలుస్తోంది. బాహుబలి మూవీ కోసం  నెలల పాటు యాక్షన్ సీన్స్ చేయడం వాలల మోకాలి నొప్పి సమస్య మొదలైంది. మొన్నటి వరకు తగ్గలేదు. ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. కానీ ప్రభాస్ కి అంతకు ముందు మోకాలి నొప్పి ఉంది. ఆ నొప్పితోనే సలార్ మూవీలో నటించాడు. అందువల్ల సరిగ్గా నడవలేకపోయాడు.

అందుకు సంబంధించిన ఒక సీన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్ ఈ సీన్ లో సరిగ్గా నడవలేక పోతున్నాడు. ఈ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఆ విషయం కనిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ ఫైట్స్ కి ఎక్కువగా  స్లో మోషన్ షాట్స్ వాడారు. ఎందుకంటె ప్రభాస్ ఈ సినిమా మొదలు పెట్టె సమయానికి మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు.

You can see Prabhas limping in this scene. Looks like his knee problem isn’t going away anytime soon.
byu/raaz9658 intollywood

 

Previous articleఏడంతస్తుల బిల్డింగ్ తో పాటు ఆస్తులు అమ్మకం… 250 కోట్ల అప్పు..! అసలు ఏం జరిగిందంటే..?
Next articleఈ రెండు ఫోటోల మధ్య 5 తేడాలు ఉన్నాయి..! అవేంటో కనిపెట్టగలరా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.