Ads
ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల అయ్యింది. దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడి ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ సినిమా కేవలం కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగం మాత్రమే. ఈ సినిమా తర్వాత కొనసాగింపుగా ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ పార్ట్ కి ప్రశ్న లాగా ఉండేలాగానే ముగించారు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాత్రలని పరిచయం చేయడంతోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వెళుతున్నంతసేపు కూడా సాధారణంగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయంలో సినిమా ఒక మంచి సీన్ తో ముగుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుండి సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. ఇంటర్వెల్ సినిమాకి చాలా పెద్ద హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత నుండి సినిమా పరిగెడుతూనే ఉంటుంది. ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. వాళ్లని తెర మీద చూస్తేనే బాగుంటుంది.
Ads
కొంత మంది నటులు కనిపించే స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అందరి పాత్రలని చూపించారు కానీ, కృష్ణుడి పాత్రను మాత్రం చూపించలేదు. అంటే పాత్రను చూపించారు. కాకపోతే కృష్ణుడి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అనేది చూపించలేదు. కానీ ఆ నటుడి వాయిస్ వింటే మాత్రం ఎక్కడో బాగా విన్న గొంతు లాగానే అనిపిస్తుంది. ఆ నటుడికి వాయిస్ ఇచ్చింది ఒక ప్రముఖ హీరో. ఆయన తెలుగు అతను కాదు. అయినా కూడా తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి సినిమాలో కూడా చేస్తున్నారు. ఆయనే అర్జున్ దాస్. విక్రమ్, ఖైదీ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు.
తెలుగులో బుట్ట బొమ్మ సినిమాలో కూడా నటించారు. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమాలో గోపీచంద్ తమ్ముడిగా అర్జున్ దాస్ నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కృష్ణుడి పాత్రకి తెలుగులో కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇదే విషయాన్ని అర్జున్ దాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కి రిప్లై ఇస్తూ షేర్ చేశారు. సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు అని అందరూ అనుకున్నారు కానీ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలియదు. ఇప్పుడు అర్జున్ దాస్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.
— Arjun Das (@iam_arjundas) June 27, 2024