Ads
వెబ్ సిరీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటే, కొన్ని మాత్రం చాలా సహజంగా ఉంటాయి. వెబ్ సిరీస్ అంటే కుటుంబం అంతా కలిసి చూడాలా? లేదా? అనే సందేహం నెలకొంటుంది. వెబ్ సిరీస్ కి సెన్సార్ ఉండదు కాబట్టి కొన్ని సార్లు కుటుంబం అంతా కలిసి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందరి ఇళ్లల్లో ఇలా ఉన్నా లేకపోయినా కొందరు మాత్రం ఇలాంటి ఆలోచనలు వచ్చిన వారు ఉంటారు.
అయితే, వెబ్ సిరీస్ లో కూడా ఆరోగ్యకరమైన కామెడీతో, సహజమైన నటనతో వచ్చిన ఒక వెబ్ సిరీస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల మూడవ సీజన్ కూడా విడుదల అయ్యింది. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సిరీస్ పేరు పంచాయత్. ఒక ఊరిలో ఈ సిరీస్ అంతా నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. మూడు సీజన్ లలో ఒక సీజన్ కి 8 ఎపిసోడ్లు ఉంటాయి. గంటలోపే ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం ఉంటుంది.
Ads
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) అనుకోకుండా ఒక ఊరికి సెక్రెటరీగా వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరికి ఉండే ప్రధాన్, బ్రిజ్ భూషణ్ దూబే (రఘుబీర్ యాదవ్), ఆయన భార్య మంజు దేవి దూబే (నీనా గుప్తా), వారి కూతురు రింకి (సాన్విక). అదే ఊరిలో ఉండే వికాస్ శుక్లా (చందన్ రాయ్) గ్రామ పంచాయత్ ఆఫీస్ లో అసిస్టెంట్ గా చేస్తూ ఉంటాడు. ప్రహ్లాద్ పాండే (ఫైసల్ మాలిక్) ఆ ఊరికి ఉప ప్రధాన్. వీళ్ళందరి చుట్టూనే కథ నడుస్తుంది.
ఈ సిరీస్ లో స్టార్లు లేరు. మంచి నటులు మాత్రమే ఉన్నారు. చిన్న పాత్రలు పోషించిన వారి నుండి, పెద్ద పాత్రలు పోషించిన వారి వరకు అందరూ చాలా బాగా నటించారు. ఈ సిరీస్ కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో కూడా ఈ సిరీస్ రీమేక్ చేస్తున్నారు. ఈ సిరీస్ ని చందన్ కుమార్ రాయగా, దీపక్ కుమార్ మిశ్రా దీనికి దర్శకత్వం వహించారు. ఇండియాలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ అనే విషయం వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సిరీస్ గురించి. ఎన్నో అవార్డులు కూడా ఈ సిరీస్ గెలుచుకుంది. క్రిటిక్స్ తో పాటు, సిరీస్ చూసిన వాళ్ళందరూ కూడా ఈ సిరీస్ ని మెచ్చుకున్నారు. ఎమోషనల్ సీన్స్ తో పాటు, కామెడీ కూడా చాలా బాగా చూపించారు.