Ads
సీనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు ఇది. సీనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం మాత్రమే కాదు. అందరికీ గౌరవం కూడా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి సీనియర్ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అప్పటి వరకు మద్రాసులో మాత్రమే ఉండేది. తెలుగు సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చారు సీనియర్ ఎన్టీఆర్. ఆయన పోషించని పాత్ర లేదు. తన సినీ జీవితంలో ఎన్నో రకమైన పాత్రలు సీనియర్ ఎన్టీఆర్ పోషించారు.
ఎన్నో రకమైన సినిమాలు చేశారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చేది మాత్రం దేవుడి పాత్రలు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ నటన అభినందనీయం. ఆయన ఆ పాత్ర ధరించి వస్తూ ఉంటే దేవుడు దిగివచ్చినట్టు చాలా మంది అనుకునేవారు. ఆయన ఫోటోలు కూడా దేవుడిలాగా అనుకున్న వాళ్లు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ దేవుడి పాత్ర వేస్తే దేవుడు ఇలాగే ఉంటారు అని అనిపిస్తుంది. పౌరాణిక సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సీనియర్ ఎన్టీఆర్ దేవుడి పాత్రలకి అభిమానులు ఉన్నారు అని అందరూ అనుకుంటారు.
Ads
కానీ కాదు. సీనియర్ ఎన్టీఆర్ దేవుడి పాత్రలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకు ఇది ఒక ఉదాహరణ. ఈ సీన్ ఒక మలయాళం సినిమాలోనిది. ఇందులో నటుడు వచ్చి, సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఉన్న ఫోటో చూసి, “ఇక్కడ దేవుడు ఉన్నారు. ఇది చాలా మంచి శకునం. ఇంట్లో మొదట ఈ ఫోటో పెట్టాలి” అని ఆ ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటారు.
పక్కనే ఉన్న అతను, “ఆయన శ్రీకృష్ణుడు కాదు. ఆయన ఎన్టీఆర్. ఎన్టీ రామారావు. ఆయన పోషించిన పాత్రల్లో ఇది ఒక ప్రముఖ పాత్ర. ఆ తర్వాత ఆయన ఆంధ్రాలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా ఎంపిక అయ్యారు” అని చెప్తాడు. ఇది తీర్పు అనే మలయాళం సినిమాలోనిది. ఈ సినిమా అప్పట్లో వచ్చిన సినిమా అనుకుంటే పొరపాటే. 2022 లో ఈ సినిమా వచ్చింది. ఈ కాలం వారికి కూడా దేవుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఇతర భాషల్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ తన పాత్రలతో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు.
Sr NTR – Lord Krishna reference in a Malayalam film ❤️🔥 Ultimate high 🔥
#NTRLivesON pic.twitter.com/hnr22zcfiK
— NTR Fans Campaign (@NFC__Mass) October 1, 2022