Ads
సీరియల్స్ కి, ప్రేక్షకులకి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. సీరియల్స్ ని సీరియల్స్ లాగా చూడరు. అందుకే సీరియల్స్ కి అంత మంది అభిమానులు ఉంటారు. సీరియల్స్ లో వచ్చే వాళ్ళని తమ సొంత వారిలాగా భావిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేసిన వారికి బయట వచ్చే కామెంట్స్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. సీరియల్స్ లో వారిని సొంత వారిలాగా భావిస్తారు కాబట్టి, తమ సొంత వారిని ఇబ్బంది పెట్టే వారిని వదిలేస్తారా? తిడుతూనే ఉంటారు.
ఈమధ్య సీరియల్స్ లో లేడీ విలన్స్ ఎక్కువగా వస్తున్నారు. ప్రతి సీరియల్ లో ఒక లేడీ విలన్ ఉండాల్సిందే. ఆ సీరియల్ లో ఆ లేడీ విలన్ ని చూసిన ప్రతిసారి కామెంట్స్ చేసేవారు, వాళ్ళని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి జనరేషన్ వాళ్లు ఇలా చాలా తక్కువగా చేస్తారు. కానీ గతంలో సీరియల్స్ బాగా చూసిన వాళ్ళు మాత్రం సీరియల్ విలన్స్ ని చాలా ఎక్కువగా తిడతారు. ఈ వీడియోలో ఇద్దరు పెద్దవారు ఉన్నారు.
వారు ఒక సీరియల్ చూస్తున్నారు. అందులో విలన్ పాత్ర పోషించే యాక్టర్ వచ్చారు. ఆమెని చూడగానే ఇద్దరు తిట్టడం మొదలుపెట్టారు. ఆమె స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఆమెను తిడుతూనే ఉన్నారు. ఈ వీడియోని వాళ్ళ ఇంట్లో వాళ్ళు షేర్ చేశారు. వీళ్ళు ఒక తమిళ్ సీరియల్ చూస్తున్నారు. ఇద్దరి వయసు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో విలన్ ని టీవీ ముందు నిల్చోని తిడుతూ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది వారి అమాయకత్వం.
ఆ విలన్ తమ సొంత వారిని ఇబ్బంది పెట్టినట్టే వారు భావిస్తారు. అంత అభిమానిస్తారు. అందుకే విలన్ పాత్ర పోషించిన చాలా మంది కూడా బయటికి రావాలి అంటే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళని ఇలా తిట్టేవాళ్ళు ఉంటారు అని వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్లని చూసి అలా తిడితే వాళ్లు విలన్ పాత్ర అంత బాగా పోషించినట్టు. వాళ్ల పాత్రలో వాళ్ళు అంత బాగా నటించినట్టు. కానీ నిజంగానే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనుకొని ఈ ఆడవాళ్లు ఇలా తిడుతున్నారు.
watch video :