Ads
ఈ ప్రమాదంలో ఆర్మీ దళానికి చెందిన 13 మంది దుర్మరణం చెందారు. బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ కూడా మృతి చెందారు. రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన బిపిన్ రావత్ మృతి చెందడంతో యావత్ దేశం దిగ్బ్రాంతిలో కూరుకుపోయింది. 1978 లో ఆర్మీ లో చేరిన బిపిన్ ఆయన తండ్రి పని చేసిన 5 వ బెటాలియన్ లోనే పని చేసారు. బిపిన్ రావత్ 2016 డిసెంబర్ 17న 27వ చీఫ్ ఆర్మీ అధికారిగా ఎంపిక అయ్యారు.
ఆయన కోసం ఆర్మీ అధికారుల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 కు పెంచారంటే.. ఆయన అందించిన సేవలు ఎటువంటివో తెలుస్తుంది. 2019 లో ఆయనను త్రివిధ దళాల అధిపతిగా నియమించారు. అప్పటినుంచి తన ప్రతిభతో, దక్షతతో ఆయన శత్రుమూకను ఎదుర్కొంటు వచ్చారు. ఇంతటి వీరుడుని ఓ ప్రమాదం కారణంగా కోల్పోవడం దురదృష్టకరం.
Ads
బిపిన్ రావత్ భారత మొట్టమొదటి త్రివిధ దళాధిపతి. మన దేశంలో ఆర్మీ కి, నేవీ కి, ఎయిర్ ఫోర్స్ కి వేర్వేరు చీఫ్స్ ఉన్నారు. మూడు దళాలకు కలిపి ఒక చీఫ్ అంటూ ఎవరు లేరు. గతంలో ఆర్మీ చీఫ్ గా పని చేసిన బిపిన్ రావత్ కు మోడీ ప్రభుత్వం “త్రివిధ దళాల అధిపతి” పోస్ట్ ని క్రియేట్ చేసి మరీ ఇచ్చింది. ఆయన ఆర్మీ లో పని చేసినప్పుడు ఆయన తీసుకొని అవార్డ్స్ లేవు. 1978 లో గూర్ఖా రైఫిల్స్ లో చేరినప్పుడు “పరమ విశిష్ట సేవా మెడల్” వరకు ఆయన అన్ని అవార్డ్స్ ని అందుకున్నారు.
డిఫెన్స్ స్టడీస్ లో ఎంఫిల్ చేసిన ఆయన కంప్యూటర్ స్టడీస్ లో డిప్లొమాని కూడా పొందారు. మీరట్ యూనివర్సిటీ నుంచి మిలిటరీ-మీడియా స్ట్రాటజిక్ స్టడీస్ లో డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని కూడా అందుకున్నారు. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్ ఘర్ వాలి రాజ్ పుత్ కుటుంబానికి చెందినవారు. ఆయన పూర్వికులు కూడా సైన్యంలోనే పని చేసారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేసారు. బిపిన్ రావత్ తండ్రికి మించిన తనయుడిగా ఆర్మీ లో పేరు తెచ్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం కారణంగా మరణించారు.