కల్కి 2898 ఏ.డీ. సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

Ads

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసి చాలా మంది అభినందిస్తున్నారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇంకొక గొప్ప సినిమా వచ్చింది అని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమాల్లో ఇది కూడా ఒకటి అనే గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒకచోట పొరపాటు జరుగుతుంది. అదే ఎడిటింగ్ వల్ల జరిగిన పొరపాటు కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది.

mistake in kalki 2898 ad

టైం లేక కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో తీసేస్తారు. దాని వల్ల కొన్ని సీన్స్ కనెక్టివిటీ మిస్ అవ్వడంతో లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇందులో ఒక సీన్ విషయంలో అలా జరిగింది. ఈ సినిమాలో హీరో కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు ఒక పాట వస్తుంది. వాళ్ల దగ్గర సరైన తిండి, బట్టలు ఏం ఉండవు. ఆయన కూడా కాంప్లెక్స్ లోకి వెళ్ళినప్పుడు హీరో, రాక్సీ పాత్ర పోషించిన దిశా పటానీ డిజైనర్ బట్టలు వేసుకొని వెళ్తారు. “అసలు వాళ్ళ దగ్గర డబ్బులే లేకపోతే ఇలాంటి బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి?” అనే ప్రశ్న అందులో నెలకొంది.

Ads

హీరోకి ఆరెంజ్ తొక్క తీసి తినాలి అనే విషయం కూడా తెలియదు. అలాంటిది ఇలాంటి బట్టలు వేసుకొని కాంప్లెక్స్ కి ఎలా వెళ్లారు అని అంటున్నారు. నిజమే ఇది. దీనికి ఏదైనా కారణం చెప్పి ఉన్నా కూడా సినిమా ఎడిట్ చేసినప్పుడు ఎక్కడైనా ఆ సీన్ పోయింది ఏమో. ఎందుకంటే ఈ సినిమాలో చాలా సీన్స్ కూడా లాజిక్ కి తగ్గట్టే రాసుకున్నారు. కొన్ని సీన్స్ మాత్రం ఇలా అయ్యాయి. కానీ ఈ సీన్ చూస్తే మాత్రం ఇది పొరపాటు జరిగినట్టు అనిపిస్తుంది.

దాంతో ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇంక సినిమా విషయానికి వస్తే, సినిమా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. ప్రతి చోటా ఈ సినిమా హౌస్ ఫుల్ షోస్ తో ఉంది. ఈ సినిమాకి తర్వాత కొనసాగింపుగా మరి కొన్ని సినిమాలు కూడా వస్తాయి. మరి ఆ సినిమాల్లో ఏం చూపిస్తారు అని తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Previous articleడల్లాస్ లో వీ ఎన్ ఆదిత్య రూపకల్పనలో కొత్త సినిమా ఆడిషన్స్ కి విశేష స్పందన
Next article“తమన్నా” తో పాటు ఉన్న ఈ అబ్బాయి… ఇప్పుడు సెన్సేషనల్ హీరో అయ్యాడు..! ఎవరో కనిపెట్టగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.