SIMBAA REVIEW: అనసూయ సింబా మూవీ రివ్యూ అండ్ రేటింగ్?

Ads

అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తూ ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఇప్పటివరకు విభిన్న పాత్రలలో నటించిన అనసూయ నేడు సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరి నేడు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది.?


కథ:

అక్ష (అనసూయ) ఒక స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉంటారు అయితే ఈమె భర్త ఒకరోజు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్ళను పోగొట్టుకుంటారు. ఇలా రెండు కాళ్లు పోవడంతో అక్ష ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు రోడ్డులో అనసూయ ఓ వ్యక్తిని చూడగానే తన మైండ్ లో ఏవేవో గుర్తుకు వస్తూ తనని ఫాలో అవుతూ ఉంటుంది అలా ఆ వ్యక్తిని చంపేస్తుంది.ఈ మర్డర్ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.

అదేవిధంగా ఒకరోజు తన ఫ్యామిలీతో కలిసి అక్ష షాపింగ్ మాల్ వెళ్తుంది అక్కడికి ఫాజిల్ తన ప్రియురాలు ఇష్ట(దివి)తో, అనురాగ్ కేసు విచారణ కోసం అక్కడికి వస్తారు అయితే అక్కడ అక్షర ఫాజిల్ ఇద్దరు ఒక వ్యక్తిని చూసి ఆయన వెంటే వెళ్లి తనని చంపేస్తారు. చనిపోయిన ఇద్దరూ పార్థ(కబీర్ సింగ్) మనుషులు కావడంతో వీళ్ళిద్దర్నీ చంపేయాలని సిన్సియర్ ఆఫీసర్ అయిన అనురాగ్ ను తప్పించి పార్ధ తమ్ముడు అక్ష ఫాజిల్ ఇద్దరిని కోర్టుకు తీసుకు వెళుతున్న సమయంలో వారిపై అటాక్ చేయిస్తారు. ఇక అక్ష ఫాజిల్ మాత్రమే కాకుండా వీరితోపాటు వచ్చిన డాక్టర్ కూడా పార్థ తమ్ముడిని చంపేస్తారు ఇలా ఈ ముగ్గురి మైండ్ లో ఏం జరుగుతోంది వీరందరూ వార్త మనుషులని ఎందుకు చంపుతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతుంది.

నటీనటుల నటన: అనసూయ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ఒకవైపు స్కూల్ టీచర్ గా నటించి మరోవైపు యాక్షన్ సన్నివేశాలలో కూడా అదరగొట్టారని చెప్పాలి.వసిష్ఠ సింహ మాత్రం పోలీసాఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. శ్రీనాథ్ పర్వాలేదనిపించాడు. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కొత్తగా నటించారు. దివి, అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తాయి.

Ads

టెక్నికల్: కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ఈ సింబా సినిమాని తెరకెక్కించాడు. ఈయనకు మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అనుకున్న కథను తెరపై ఎంతో అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకుల చూపు తిప్పకుండా చేశారు.టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు దర్శకుడు మురళీ. మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో తన సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా కూడా ఆ అనుభవరాహిత్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు. తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడు. ఆయన మేకింగ్, టేకింగ్‌కు అందరినీ మెప్పిస్తుంది. సినిమాకు ఏది అవసరము ఆ విషయాన్ని టెక్నికల్ టీం నుంచి రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక సంపత్ నంది మాటలు అద్భుతంగా ఉన్నాయి మొత్తానికి టెక్నికల్ పరంగా ఈ సినిమా కూడా అందరిని మెప్పించింది.

విశ్లేషణ:

ఈ సినిమా కథ చూస్తే ఒక రివేంజ్ స్టోరీ లాగే అనిపిస్తుంది.సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన అంశాలను కూడా తీసుకువచ్చారు సినిమా మొదలైన కొద్దిసేపటికే కథలోకి వెళ్తారు ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఎందుకు ఈ ముగ్గురు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతోందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కొన్ని మరీ సిల్లీగా, లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ఇక చెట్లు నాటడం పర్యావరణాన్ని కాపాడడం అని కాన్సెప్ట్ బాగానే ఉంది.

బాటమ్ లైన్: సింబా సినిమా సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు మనకి ఎంత అవసరం అనేది ఒక కమర్షియల్ రివెంజ్ కోణంలో చూపించారు.

రేటింగ్: 3/5

Previous articleసింబా టీం ఆఫర్ ఇదే.. డైరెక్టర్ ఎమోషనల్ స్పీచ్
Next articleరవితేజ, హరీష్ శంకర్ ల “మిస్టర్ బచ్చన్” అంచనాలను అందుకొని హిట్ కొట్టిందా? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.