‘అరి’ ఆ ఇద్దరికి అంకితం.. కదిలించే పోస్ట్ వేసిన దర్శకుడు జయశంకర్

Ads

ఓ దర్శకుడు తన చిత్రం కోసం ఎంత పరితపిస్తుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ప్రాణం పెట్టి సినిమాను పూర్తి చేస్తాడు. అలా ‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాల బాటపడ్డాడు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిశారు.. ఆశ్రమాల్లో గడిపారు. అలా అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్‌ను మూడేళ్లు కష్టపడి కథగా రాసుకున్నాడు.

నాలుగేళ్లు కష్టం తరువాత ‘అరి’ మూవీని అక్టోబర్ 10న ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. అయితే జయ శంకర్ చేసిన ఈ ప్రయాణంలో తనకు బ్యాక్ బోన్‌గా నిలిచిన, ప్రాణానికి ప్రాణమైన తండ్రి(వంగ కనకయ్య)ని, బావ(కె.వి. రావు)ని కోల్పోయాడట. అందుకే ఈ అరి మూవీని వారిద్దరికీ అంకితం చేస్తున్నాను అంటూ జయశంకర్ తాజాగా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. జయశంకర్ వేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరి మనసుల్ని తాకేలా ఉంది.

‘రేపటి నుంచి అరి ఇక ఆడియెన్స్ సొంతం.. నాకు ఈ మూవీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.. ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు, బావ గారు మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను.. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను’ అని పోస్ట్ వేశారు.

 

Previous articleడివైన్ ట్రెండ్‌లో ‘అరి’: కృష్ణుడు ఎంట్రీతో అంచనాలు అమాంతం పెరిగాయే