Ads
ఇప్పుడున్న కాలంలో చాలామంది ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు.
Ads
ఈ క్రమంలో చాలా మంది రాత్రిపూట చపాతీని ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొంతమంది భోజనం తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలామందిని ఒక ప్రశ్న వేధిస్తోంది. అది ఏమిటంటే రాత్రి సమయంలో చపాతీ తీసుకుంటే మంచిదా? లేదా భోజనం తీసుకుంటే మంచిదా? అనేదే ఆ ప్రశ్న. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..సాధారణంగా ఎవరు బరువు తగ్గాలని అనుకుంటారో, అలాంటివారు రాత్రి సమయంలో చపాతీలను తింటే మంచిదని అంటున్నారు. అంతేకాకుండా చపాతీలను కూరగాయలు,పెరుగు, పప్పుతో తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే చపాతీల ద్వారా మనిషి శరీరానికి అవసరమయ్యే జింక్, కాల్షియం, ఫాస్పరస్ లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. చపాతీలో ఫైబర్ ఉండటం వల్ల తినేవారికి త్వరగా ఆకలి వేయదని చెప్పవచ్చు. అధికబరువు, ఊబకాయం, అజీర్తి, మలబద్దక సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో చపాతీ తీసుకోవడం మంచిది అంటున్నారు.ప్రాసెస్ చేయడం ద్వారానే అన్నం, చపాతీలు రెండు తయారు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే పాలిష్ పెట్టిన బియ్యం వండుకుని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవనే చెప్పాలి. రైస్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ లు ఉంటాయి. అందువల్ల ప్రోటీన్ ఎక్కువగా తీసుకుని, కార్బోహైడ్రేట్ లు తగ్గిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. వైద్య నిపుణులు మధ్యాహ్న సమయంలో అన్నం తీసుకుంటే పరవాలేదని, కానీ రాత్రి పూట తప్పనిసరిగా చపాతీలను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక రాత్రి పూట చపాతీలా? అన్నం తినాలా అని కంగారు పడేవాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.
Also Read:”హరిహర వీర మల్లు” ఎవరు..? ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా..?