మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్న భూమా మౌనిక గురించిన ఆసక్తికర విషయాలు.

Ads

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా మంచు మనోజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుండి వరుస సినిమాలలో నటిస్తున్నాడు. తన సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నాడు.

Ads

అంతేకాకుండా మంచు ఫ్యామిలిలో అందరి కంటే కూడా డిఫరెంట్ వ్యక్తిత్వంతో అభిమానుల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆయన వివాదాలకు దూరంగా ఉంటూ, కొన్ని విషయాలలో అభిమానులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి మనోజ్ కొంత కాలంగా సినిమాలలో నటించకుండా, దూరంగా ఉంటున్నాడు. మంచు మనోజ్ మూవీ వచ్చి కొన్ని సంవత్సరాలు అయ్యాయి.
ఇక మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నప్పటి నుండి మూవీస్ కు దూరంగా ఉంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారనే విషయంలో ఎవరికి కూడా క్లారిటీ లేదు. అయితే ఈ క్రమంలోనే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.
మనోజ్ తాజాగా భూమా మౌనికతో పెళ్లి వార్తలపై స్పందించారు. అయితే అది తన పర్సనల్ విషయమని, సందర్భం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు. కానీ సినీ వర్గాల్లో మాత్రం మంచు మనోజ్, భూమా మౌనికల వివాహం ఖాయం అని తెలుస్తోంది. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే ఆమె దివంగత పొలిటికల్ లీడర్ భూమా నాగిరెడ్డి రెండో కూతురు.
అయితే భూమా మౌనిక ఇదివరకే ఒక వ్యక్తిని వివాహం చేసుకుని మనస్పర్ధలు రావడంతో ఆ వ్యక్తితో విడిపోయారు. ఆమెకు ఐదు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. మౌనిక ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాలిటిక్స్ లో విజయం సాధించాలని మౌనిక భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అక్క అఖిలప్రియతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. భూమా మౌనికకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజల్లో మంచి పేరు ఉంది.
Also Read: అజిత్ తెగింపు సినిమా రివ్యూ.. టాక్ ఎలా వుందంటే?

Previous articleఅందం తగ్గిందంటూ కామెంట్ చేసిన నెటిజెన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత..
Next articleVeera Simha Reddy Review: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్ కు పండగ
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.