Ads
భారతీయ సినీ చరిత్రలో అత్యున్నత సిని పురస్కారం దాదాసాహెబ్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. తెలుగు సిని దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎల్వీ ప్రసాద్ దర్శకుడిగాను , నిర్మాతగా, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులను పొందారు.
Ads
ఇప్పటి తరం వారికి ఆయన పేరు చెప్తే గుర్తు పట్టలేరు. అయితే ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పటల్ లేదా ప్రసాద్ ల్యాబ్స్ గురించి కానీ, ప్రసాద్ ఐమాక్స్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అవసరాలకు మనం ప్రతిరోజూ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాము. అయితే వాటి వెనక ఉన్న వ్యూహ కర్త ఎవరనే విషయం మాత్రం ఈతరం వారికి తెలియదనే చెప్పవచ్చు.
ఎల్వీ ప్రసాద్ అసలు పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. ఏపీలో రైతు కుటుంబంలో జన్మించిన ఎల్వీ ప్రసాద్, ఎన్నో కష్టాలకు ఓర్చుకొని అంచెంలంచెలుగా ఎదిగాడు. నటుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా , దర్శకుడిగా చాలా విజయాలు సాధించారు. ఏన్నో ఘనతలు పొందిన ఆయన యాక్టర్ గా కూడా ఎవరూ చేయలేని ఒక రికార్డును నమోదు చేశారు.
1931 లో హిందీ తొలి సినిమా ‘ఆలం అరా’, 1932 లో తమిళ తొలి సినిమా ‘కాళిదాస్’, అదే ఏడాది తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ సినిమాల్లో నటించారు.ఇలా ఆయన మూడు భాషల తొలి సినిమాలలో చేసిన ఏకైక నటుడిగా రికార్డు సృష్టించాడు. సినీ రంగానికే పరిమితం కాకుండా ఆయన ప్రసాద్ గ్రూప్ పేరుతో చాలా సంస్థలను స్థాపించాడు. ఎల్వీ ప్రసాద్ గారు ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా భారతదేశంలోనే తిరుగులేని వ్యాపార సంస్థను అభివృద్ధి చేశారు.
ఎల్వీ ప్రసాద్ అనంతరం ఆయన కుమారుడు రమేష్ ప్రసాద్ వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆయన పేదల అందరికి కంటి చూపు అందాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రిని మొదలుపెట్టారు. అలా ఆయన లక్షల మందికి ఉచితంగా కంటి చూపును అందించారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసారు. ఇక ఆయన నిర్మించిన ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఎన్నో చిత్రాలకు సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ ‘సింహాసనం’ సినిమాకి పెట్టింది రూ.3.50 కోట్లు.. ఎంత వచ్చిందో తెలుసా ?