Ads
వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమా కి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో అల్లరి చేస్తూ అందరినీ మెప్పించేసింది. తన అల్లరి చేష్టలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్రియేట్ చేసేసింది. సినిమా విడుదలైన తర్వాత యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా శ్వేతాబసు ప్రసాద్ సంపాదించుకుంది.ఆ తర్వాత ఆమెకి మంచి అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాతోనే కాస్త అమాయకంగా నటించి అందరికీ బాగా గుర్తుండిపోయింది ఈమె.
వరుణ్ సందేశ్ కూడా హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. కానీ రాను రాను అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. కొత్త బంగారులోకం సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. కాలేజీ చదువుతున్న విద్యార్థుల ప్రేమ కథ తో ఈ సినిమా కథ సాగుతుంది.
Ads
ఈ సినిమాకి పాటలు మిక్కి జే మేయర్ అందించారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట కూడా అందరికీ బాగా నచ్చింది. మంచి రెస్పాన్స్ పాటలకు వచ్చింది. కాలేజీ పిల్లలు ఏ విధంగా నడుచుకుంటారు అనే దాని మీద ఈ కథ ని తీసుకువచ్చారు. అయితే కొత్త బంగారులోకం సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఉంది. ఎప్పుడైనా మీరు దాన్ని గమనించారా మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త బంగారు లోకం సినిమాలో బాలు అంటే వరుణ్ సందేశ్ స్వప్న ని ప్రేమిస్తాడు.
తర్వాత తన తండ్రి చనిపోవడంతో ఆమెని పట్టించుకోకుండా దూరంగా ఉంటాడు. తర్వాత స్వప్న తండ్రి కనిపించి ఏం చేశావు అని అడిగితే… ఇంజనీరింగ్ అయిపోయిందని చెప్తాడు. నిజానికి వరుణ్ సందేశ్ ఇంటర్ లో బైపీసీ చదువుతాడు. వరుణ్ సందేశ్ కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం లో బాలు, బైపీసీ అని రాసి ఉంటుంది. ఆ ఉత్తరాన్ని బాలు కి తెలీకుండా స్వప్న చదువుతుంది. ఆ ఉత్తరం మీద బైపీసీ అని క్లియర్ గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఇంజనీర్ అయిపోయానని చెప్తాడు బైపిసి చదివి ఇంజనీర్ ఎలా అవుతారు అని పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి.