Ads
ఆంజనేయ స్వామిని హిందువులు పూజిస్తారు. ప్రతి శనివారం మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలానే హనుమాన్ జయంతిని పెద్ద పండుగగా భావించి జరుపుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా దీన్ని గమనించారా..? హనుమాన్ జయంతిని ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు అని… హనుమాన్ జయంతిని హిందువులు ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు.
దీనికి ముఖ్య కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. సీతాదేవినే రావణుడు ని అపహరించినప్పుడు సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు వెతుకుతాడు.
హనుమంతుడు మంగళవారం తెల్లవారుజామున సీతాదేవి ఆచూకీ కనుగొంటాడు. అది చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి. అశోక నగరాన్ని ఆ రోజు హనుమంతుడు నాశనం చేస్తాడు. అలానే అక్కడ రావణ సైనికుల్ని కూడా చంపేస్తాడు. హనుమంతుడు తోక తో సగం లంకని కూడా దహనం చేస్తాడు హనుమంతుడు. హనుమంతుడు విజయం కారణంగా ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు హిందువులు. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వస్తుంది.
Ads
కానీ కొందరు మే లో కూడా హనుమాన్ జయంతిని జరుపుకోవచ్చని అంటూ ఉంటారు. అది వైశాఖ మాసం. శుక్ల దశమి. మే నెల చివరి లో ఇది వస్తుంది. పూర్వభద్ర పాద నక్షత్రం లో చంద్రుడు తో పాటు హనుమంతుడు జన్మించాడు. పరాశరసహిత ప్రకారం ఆ నాడే హనుమాన్ జయంతి అని అంటారు. ఈ కారణంగానే రెండు రోజులు కూడా హనుమాన్ జయంతిని జరుపుతారు. హనుమంతుడు శనివారం నాడు పుట్టాడు. హనుమంతుడు అంజనా కేసరికి పుట్టారు.
అంజన ధ్యానం చేస్తున్నప్పుడు వానరుడ నాయకుడు రెండు ఏనుగులని చంపేస్తాడు. ఋషులని కాపాడే క్రమం లో ఈ ఎనుగుల్ని చంపేస్తాడు. అప్పుడు తన కష్టానికి మెచ్చి కేసరి అని పిలుస్తారు. ఆ తర్వాత కేసరి రాక్షసులను కూడా చంపేస్తారు అప్పుడు దేవతలు అంజనా తో పెళ్లి అవ్వాలని దీవిస్తారు. అంజనా రిషి గౌతమ అహల్య కి పుట్టారు.