Ads
పెళ్లయిన మహిళలు వాళ్ళ భర్తని పేరు పెట్టి పిలవరు. హిందూ సంప్రదాయ ప్రకారం మహిళలు వారి భర్తలని పేరు పెట్టి పిలవరు.. పిలవకూడదని అంటారు. ఈ విషయాన్ని పెద్దలు కూడా మనకి చెబుతూ ఉంటారు. మీరు కూడా మీ భర్తని పేరు పెట్టి పిలవరా..? అసలు ఎందుకు పిలవకూడదు అనేది మీకు తెలుసా..? అయితే ఇలా అనుసరించే వాళ్ళు ఉన్నారు.
అలానే భర్తని పేరు పెట్టి పిలవడం లేదంటే బుజ్జి కన్నా అంటూ నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తున్న వారూ వున్నారు.
ఒకవేళ కనుక తెలిసిన కుటుంబాల నుండి పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ భర్తని అరె, ఒరేయ్ అని కూడా అంటూ ఉంటారు. కానీ మన పూర్వీకులను చూసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తని పేరు పెట్టి పిలిచేవారు కాదు. పైగా అలా పిలవడం మంచిది కాదని తరచు వాళ్ళు మనకి చెబుతూ ఉంటారు. దీని వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Ads
ఎప్పుడూ కూడా భర్తని నలుగురు మధ్య పేరు పెట్టి పిలవకూడదు. ఇది వారి గౌరవాన్ని తగ్గించేస్తుంది. అందరి ముందు భర్త ని పేరు పెట్టి పిలిస్తే భర్త మీద ఎవరికి కూడా గౌరవం ఉండదు. శ్రీరాముడు సీతని జనక రాజపుత్రి అని పిలిచేవారు. సీతాదేవి కూడా శ్రీరాముడిని చాలా సార్లు పేరు పెట్టి పిలిచింది. కానీ నలుగురు మధ్య కాదు ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ భార్యని ఎలా అయినా పిలుచుకోవచ్చు.. భర్తని కూడా ఎలా అయినా పిలుచుకోవచ్చు…
కానీ ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం అలా పిలవకూడదు. ఎదుట వాళ్ళ ముందు మీ భర్తను తిట్టడం, ముద్దు పేర్లు పెట్టి పిలవడం లేదంటే పేరు పెట్టి పిలవడం వంటివి చేయకూడదు. అత్త ఇంటి వారి ముందు కానీ అమ్మ ఇంటి వాళ్ళ ముందు కానీ అస్సలు ఇలా చేయకూడదు ఈ తప్పు కనుక మీరు చేస్తున్నట్లయితే ఇక మీదట చేయకండి. మీ భర్త గౌరవం తగ్గిపోతుంది అని గుర్తుంచుకోండి.