క్యారెక్టర్ ఆర్టిస్ట్ ”రవిప్రకాష్” గురించి చాలా మందికి తెలియని విషయాలివి..!

Ads

ఇండస్ట్రీలో సక్సెస్ అవడం అందరికీ సాధ్యం కాదు. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ చాలా మందికి అవకాశాలు రాక.. ఆ కలని చంపేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ట్యాలెంట్, అదృష్టం ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అయితే ఎక్కువగా సహాయ పాత్రలు చేసే రవి ప్రకాష్ కూడా ఆశించిన స్థాయి లో సక్సెస్ సాధించ లేకపోయినప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఇండస్ట్రీ లో చాలామంది డాక్టర్లు అవ్వాలని యాక్టర్లు అయిపోయారు. అటువంటి వారి లో రవి ప్రకాష్ కూడా ఒకరు.

Ads

క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ తెలుగు, తమిళ, కన్నడ సినిమాల లో నటించారు. సుమారు 200 పైగా సినిమాల్లో ఈయన నటించారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన ఎంట్రీ ఇవ్వలేదు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ చిత్రం తో కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద నటించారు. అతడు, వేదం, ఘర్షణ ఇలా చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా చేశారు రవి ప్రకాష్. రవి ప్రకాష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలని మనతో పంచుకున్నారు మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

రవి ప్రకాష్ విశాఖ లో జన్మించారు. ఆయన స్టడీస్ అంతా కూడా విశాఖ లోనే పూర్తి చేశారు. విశాఖ వ్యాలీ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఆ తరవాత ఆయన మాస్కో లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. తర్వాత కొంత కాలం హైదరాబాదు లోనే ప్రాక్టీస్ చేశారు అనుకోకుండా స్నేహితులు బంధువుల ప్రోత్సాహం తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు శుభవేళ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన రవి ప్రకాష్ చాలా సినిమాల్లో నటించి యాక్టర్ గానే స్థిరపడిపోయారు.

Previous articleఈ ఫోటోలో తన తండ్రితో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Next article“గుప్పెడంత మనసు” సీరియల్ లో రిషి ఫోటోకి దండ..? ఈ ట్విస్ట్ ఏంటి..?