Ads
టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా మగధీర అని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి చారిత్రాత్మక బ్యాక్ డ్రాప్ కి, ప్రస్తుత కాలానికి అనుసంధానం చేస్తూ తీసిన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. నలబై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
Ads
జక్కన్న ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. ఇక రాజమౌళి కెరీర్ లోనే మగధీర సినిమా అనేది ఒక ప్రత్యేకం. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం అద్భుతమే. ఇందులో ప్రధానంగా శతదృవవంశయోధుడుగా వంద మందితో హీరో రామ్ చరణ్ చేసిన పోరాట సన్నివేశం ఈ మూవీకే హైలైట్ అనవచ్చు. రాజమౌళి ఈ సినిమా కోసం అద్భుతమైన గ్రాఫిక్స్ ను వాడుకున్నాడు. ఈ చిత్రంతో ఇటు రాజమౌళికి అటు రామ్ చరణ్ కి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక సినిమా కథలో మగధీర నాలుగు వందల ఏళ్ల తరవాత హర్షగా మళ్లీ పుడతాడు. అది మాత్రమే కాకుండా మగధీర ప్రేయసి, యువరాణి మిత్రబింద కూడా నాలుగు వందల ఏళ్ల తరవాత మళ్లీ జన్మిస్తుంది. సినిమాలో ఈ ఇద్దరు తొలిసారి కలుసుకునే సన్నివేశం ఇప్పటికీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ సన్నివేశం నుంచి అసలు స్టోరి ప్రారంభమవుతుంది.ఇక ఈ సీన్ లో హీరోయిన్ కాజల్ చేయి తగలగానే రామ్ చరణ్ కు ఒక్కసారిగా పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య విద్యుత్ పాస్ అయినట్లుగా కనిపిస్తుంది. ఆ తరవాత వచ్చే కొన్ని సన్నివేశాలలో కూడా ఇదేరకంగా విద్యుత్ పాస్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇక మగధీర మూవీ చూసిన తరవాత అందరు సినిమా చాలా బాగుంది అన్నారు. కొంతమంది హీరో హీరోయిన్ల నటన నచ్చింది. అలా అందరు దర్శకధీరుడు రాజమౌళిని మెచ్చుకున్నారు.
కానీ అందులో కొంతమందికి ఒక డౌట్ వచ్చింది. అది ఏమిటి అంటే హీరోహీరోయిన్లు ఇద్దరూ కలుసుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వివాహం చేసుకున్న తరవాత ఇద్దరూ ఒకరిని ఒకరు తాకినపుడు కూడా కరెంట్ పాస్ అవుతుందా, లేదా షాక్ రావడం ఆగిపోతుందా అనేదే. అయితే ఈ విషయం పై జక్కన్న కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి ఈ మూవీ విడుదల అయ్యి 14 ఏళ్లు అవుతోంది. అయితే సోషల్ మీడియా వల్ల ఈ సన్నివేశానికి సంబంధించిన మీమ్స్ కనిపిస్తున్నాయి.
Also Read: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ”రవిప్రకాష్” గురించి చాలా మందికి తెలియని విషయాలివి..!