Ads
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే లిఫ్ట్ లు, ఎలివేటర్లు ఎక్కువగా కనబడుతున్నాయి. లిఫ్ట్లు ఎలివేటర్లు కన్స్ట్రక్ట్ చేయడం వాటిని నడిపించడం ఖర్చుతో కూడుకున్నదే… కానీ పెద్ద పెద్ద భవనాలు అపార్ట్మెంట్లు రావడంతో మెట్లు మీద అన్ని అంతస్తులు ఎక్కడం కష్టంగా ఉంటుంది. అందుకని ఎలివేటర్లని లిఫ్ట్ లని పెడుతున్నారు. లిఫ్ట్ ద్వారా మనం సులభంగా ఎన్ని అంతస్తులు ఉన్నా సరే మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
పైగా అంత పెద్ద శ్రమ కూడా మనకి కలగదు. ఈజీగా మనం లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళచ్చు. పెద్దవాళ్ళకి కూడా సులభంగా ఉంటుంది. వయసు పైబడి ఉన్న వాళ్ళకి మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది.
అటువంటి వాళ్ళు కూడా ఈజీగా పైకి వెళ్ళచ్చు. అయితే ఎప్పుడైనా లిఫ్ట్ ఎక్కినప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించారా..? లిఫ్ట్ లో అద్దం ఉంటుంది. ఎందుకు లిఫ్ట్ లో అద్దాన్ని పెడతారు..? అద్దం వలన మనకి ఏమైనా లాభం ఉంటుందా అని… అద్దం ఊరికే షోకు కోసం పెట్టరు అద్దం వలన ఉపయోగం ఉందట. మరి లిఫ్ట్ లో అర్థం ఉండడం వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Ads
#1. సెక్యూరిటీగా మనకి అనిపిస్తుంది:
లిఫ్ట్ లో అద్దం ఉండడం వలన మనకి భయం ఏమీ లేకుండా సెక్యూరిటీగా ఉంటుంది పైగా వెనుక నుండి ఎవరైనా దొంగతనం చేయడానికి చూస్తున్న సరే మనకి తెలుస్తుంది. జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ ప్రకారం అద్దం లిఫ్ట్ లో ఉండడానికి కారణం వీల్ చైర్ లో వెళ్లే వాళ్లకి సులభంగా వెళ్లడానికి రావడానికి ఉంటుందని పెడతారట.
#2. యాంగ్జైటీ క్లాస్రోఫోబియా నుండి రిలీఫ్ ని పొందొచ్చు:
చాలామంది ఇరుకుగా ఉండేందుకు ఇష్టపడరు. అద్దం ఉండడం వలన లిఫ్ట్ చూడడానికి విశాలంగా కనబడుతుంది దీంతో కంఫర్ట్ గా ఉంటుంది భయం ఉండదు.
#3. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంచుతుంది:
చాలామంది లిఫ్ట్ లో వున్నప్పుడు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు లిఫ్ట్ లో అద్దం ఉండడం వలన అటువంటి ఫీలింగ్స్ నుండి మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది.