Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటించిన చిత్రం బీమ్లా నాయక్. ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. మలయాళ చిత్రం అయ్యప్పనం కోషియంకి రీమేక్ గా తెలుగులో బీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్, రానా పోటీ పడి మరి నటించారు. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే ముందు మరో హీరోని అనుకున్నారంట. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Ads
మలయాళంలో వచ్చిన అయ్యప్పం కోషియం మూవీ సూపర్ హిట్ అవడంతో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుని రీమేక్ హక్కులని కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమాలో నాగ వంశీ ఎవరిని హీరోగా తీసుకోవాలనుకుంటుండగా హీరో బాలకృష్ణ అయితే సెట్ అవుతాడని, బాలకృష్ణకి చెప్పగా ఆయన వంశీతో ఈ మూవీ తన కంటే హీరో పవన్ కళ్యాణ్ కి అయితే బాగుంటుందని, ఆయనతో ఈ మూవీ చేసినట్లయితే హిట్ అవుతుందని చెప్పారట. అప్పుడు ఈ మూవీ పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలా ఈ సినిమాని పవర్ స్టార్ కున్న ఇమేజ్ కి సరిపోయెట్టుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్పులు చేశారట. ఇక హీరోగా పవన్ కళ్యాణ్ సెట్ అవడంతో ఈ మూవీలో మరో కీలకమైన పాత్ర అయిన డానియల్ శేఖర్ గా ఎవరు నటిస్తే సెట్ అవుతుందని ఆలోచిస్తున్నప్పడు పవన్ కళ్యాణ్ హీరో రానా అయితే ఈ పాత్రకి సెట్ అవుతాడని చెప్పగా అప్పుడు రానాను తీసుకున్నారు.
వారిద్దరి క్యారెక్టర్స్ ఫైనల్ అయిన తరువాత దర్శకుడిగా సాగర్ కే చంద్రను, పవన్ కళ్యాణ్ వైఫ్ గా నిత్యా మీనన్ ను, రానా దగ్గుబాటి వైఫ్ గా సంయుక్త మీనన్ ని ఎంపిక చేశారు. ఆ విధంగా భీమ్లా నాయక్ మూవీ సెట్స్ మీదకి వెళ్లింది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ మూవీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పవచ్చు. నటసింహం బాలకృష్ణ నటించాల్సిన ఈ మూవీని పవన్ కళ్యాణ్ చేసాడు.
Also Read: దర్శకధీరుడు రాజమౌళి నటించిన సినిమా ఏమిటో తెలుసా?