Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, స్వయంకృషితో వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగపరచుకుని అగ్ర నటుడిగా ఎదిగారు.
Ads
చిరంజీవి 150 చిత్రాలకు పైగా నటించారు. తనకంటూ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుని మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. తన సినీ కెరీర్ లో అద్భుతమైన పాత్రలలో నటించడమే కాక, ఎన్నో సినిమాలలో కష్టమైనా కూడా రియల్ స్టంట్స్ చేసి ఆడియెన్స్ ని అలరించారు. తన 66 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ సినిమాలలో నటించడంలోనే కాకుండా లుక్ పరంగా, ఫిట్ నెస్ పరంగాను యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొడుతున్నారు.
సినిమాలలో తరచూ నిజమైన రిస్కీ ఫైట్లతో ఆకట్టుకునే హీరోలు కూడా కొన్ని సార్లు డూప్ లతో చేయాల్సిన సందర్భాలు వస్తాయి.కొన్ని రకాల రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేసే సమయంలో హీరోలకు ప్రమాదం ఏదైనా జరుగుతుందనే భయం ఏర్పడినపుడు సమయంలో ఆ సీన్స్ ని డూప్ లతో షూట్ చేస్తారు. అయితే ఎలాంటి రిస్క్ సీన్స్ చేసినా కూడా గతంలో ఈ డూప్ ల గురించి ఆడియెన్స్ కి ఎక్కువగా తెలియలేదనే చెప్పవచ్చు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి రావడంతో ఇండస్ట్రీకి సంబంధించి చిన్న విషయాలు కూడా క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. అలాగే హీరోలకు డూప్ లుగా నటించేవారి గురించి తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కొన్ని చానెల్స్ హీరోలకు డూప్ లుగా నటించేవారిని ఇంటర్వ్యూలు చేస్తుండడంతో వారు ఎవరో తెలియడమే కాకుండా వారికి గుర్తింపు లభిస్తోంది.
అలానే ఒక షోలో మెగాస్టార్ చిరంజీవికి గత ముప్పై ఏళ్లుగా డూప్ గా నటిస్తున్న వ్యక్తి గురించిన వివరాలు తెలిశాయి. ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోను నిర్వహించేవారు కొన్ని ప్లేస్ లకి వెళ్లి అక్కడ ప్రతిభ ఉన్నవారిని తీసుకువచ్చారు. ఇక ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి వెళ్ళినపుడు ఆ షోకి చిరంజీవికి డూప్ గా చేస్తున్న వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకి చెందినవాడు. ప్రేమ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవికి గత ముప్పై 30 సంవత్సరాలుగా డూప్ గా చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
Also Read: హీరోలకు సూపర్ స్టార్, మెగాస్టార్ బిరుదులు ఎలా వచ్చాయంటే…?