Ads
తెలుగులో స్టార్ కమెడియన్లలో అగ్రస్థానంలో బ్రహ్మానందం ఉంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో చిత్రాలు విజయం పొందడంలో ముఖ్య పాత్రను పోషించారు.
Ads
ఇక కొన్ని చిత్రాలు అయితే బ్రహ్మానందం కామెడీ వల్లే హిట్ గా నిలిచాయని ఇండస్ట్రీలో అనుకుంటారు. ఆయన కామెడీ లేనట్లయితే ఆ చిత్రాల ఫలితం వేరేలా ఉండేదని చాలామంది అభిమానులు భావిస్తారు. కొన్ని క్యారెక్టర్స్ కి ఆయన తప్ప మరెవరూ న్యాయం చెయ్యలేరు.
దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన చాలా చిత్రాల విజయనికి బ్రహ్మానందమే కారణమని అనవచ్చు. ఎందుకంటే యావరేజ్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువ సార్లు చూడటానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా బ్రహ్మానందం కారణం. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ మూవీ, రెడీ, నాగార్జున కింగ్ చిత్రాల విజయంలో బ్రహ్మానందం పాత్ర కూడా ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా, వెంకటేష్ నమో వెంకటేశ చిత్రాల సక్సెస్ కు కూడా ఆయనే కారణమని ఇండస్ట్రీలో టాక్.
దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణ, అల్లుడు శ్రీను, అదుర్స్ చిత్రాలలో బ్రహ్మానందం పంచ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం మూవీ హిట్ అవ్వడంలో కూడా బ్రహ్మానందం పాత్ర ఉంది. ఇక దూకుడు చిత్రంలో బ్రహ్మానందం కామెడీ లేకుండా చూడలేం. ఈ మూవీ సక్సెస్ కు కూడా బ్రహ్మానందం కారణం,ఇక ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ కామెడీ కూడా చాలా ఆకట్టుకుంది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు.
రవితేజ నటించిన కిక్, దుబాయ్ శ్రీను, వెంకీ, విక్రమార్కుడు, జాతిరత్నాలు లాంటి సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ టైమింగ్ అలరించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది చిత్రాలల్లో బ్రహ్మానందం పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయి. మన్మథుడు, జల్సా సినిమాలలో కూడా ఆయన కామెడీ అలరించింది. అంతేకాకుండా కొన్ని అపజయం పొందిన చిత్రాల్లో కూడా ఆయన కామెడీ బాగుంటుంది.
Also Read: సింహాద్రి, అత్తారింటికి దారేది సినిమాలలోని ఈ సీన్స్ గమనించారా?