Ads
మనం పక్షులని చూస్తే పక్షులు ఎక్కువగా కరెంటు తీగలు మీద కూర్చుంటూ ఉంటాయి. అయితే పక్షులు కరెంట్ తీగ మీద కూర్చున్నా సరే వాటికి షాక్ కొట్టదు. విద్యుత్ ప్రవహించినప్పటికీ కూడా పక్షులకి ఏమీ అవ్వదు. ఎప్పుడైనా మీకు కూడా ఈ సందేహం కలిగిందా…? పక్షులు కరెంటు తీగ మీద కూర్చుంటే వాటికి షాక్ ఎందుకు కొట్టదు అని… మీకే కాదండి చాలా మందికి ఈ సందేహం ఉండే ఉంటుంది.
ఈరోజు మనం పక్షులు కరెంటు తీగ మీద కూర్చున్నప్పటికీ ఎందుకు షాక్ కొట్టదు అనే విషయాన్ని చూద్దాం. మన ఇంటికి సింగిల్ ఫేస్ కరెంటు ని ఉపయోగిస్తూ ఉంటారు.
Ads
అదే ఫ్యాక్టరీలకి వగైరా చోట్లకి అయితే మూడు ఫేసుల కరెంట్ ఇస్తారు. ఇలా లైన్స్ వేరుగా ఉంటాయి. అయితే ఎటువంటి లైన్ అయినప్పటికీ కరెంట్ షాక్ మనకి కొడుతూ ఉంటుంది. కానీ పక్షులకి మాత్రం అసలు షాకే కొట్టదు. రెండు కారణాల వలన పక్షులకి షాక్ కొట్టదట. ముందుగా మొదటి కారణాన్ని మనం చూస్తే.. ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోట నుండి తక్కువ పొటెన్షియల్ ఉన్న దగ్గరికి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అయితే పక్షులు వైరు మీద కూర్చున్నప్పుడు ఆ పక్షి యొక్క రెండు కాళ్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ దాదాపు శూన్యం. అందుకని కరెంట్ అనేది పక్షి ద్వారా ప్రవహించదు. సో పక్షికి షాక్ కొట్టదు. అదే ఒకవేళ పక్షి ఒక వైర్ మీద కూర్చుని మరో కరెంటు వైర్ ని కానీ భూమిని కానీ పట్టుకుంటే ఖచ్చితంగా వాటికి కూడా షాక్ కొడుతుంది. కరెంట్ పక్షి ద్వారా ప్రవహించే భూమిలోకి వెళుతుంది.
ఇంకో కారణం ఏమిటంటే విద్యుత్తు ఎప్పుడు కూడా తక్కువ రెసిస్టెన్స్ ద్వారా ప్రవహిస్తుంది. ఏ జీవి అయినా సరే కాస్త నిరోధం కలిగి ఉంటాయి. మనిషి కంటే కూడా రెసిస్టెన్స్ పక్షికి ఎక్కువ ఉంటుంది. సో విద్యుత్ పక్షి ద్వారా ప్రవహించదు. అందుకనే పక్షులకి షాక్ కొట్టదు. మనిషికి కూడా కరెంటు తీగని పట్టుకున్న షాక్ కొట్టకుండా ఉండాలంటే భూమిని తగలకుండా వట్టి తీగను పట్టుకుంటే షాక్ అనేది కొట్టదు. కానీ తీగని గట్టిగా పట్టుకుని భూమికి తగలకుండా వేలాడితేనే అది సాధ్యమవుతుంది.