”కాంతారా” సినిమాలో శివ ఆఖరున ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతాడు..?

Ads

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార సినిమా అందరికీ తెగ నచ్చింది. సైలెంట్ గానే ఈ సినిమా హిట్ కొట్టేసింది. ఒక పక్క దర్శకుడుగా మరొక పక్క హీరోగా కూడా మెప్పించేసాడు రిషబ్ శెట్టి. ఈ కన్నడ సినిమా తెలుగులో చక్కటి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. కన్నడ, తెలుగు, హిందీ లో కూడా ఈ సినిమా భారీగానే రికార్డ్స్ ని సొంతం చేసుకోవడం జరిగింది.

ఈ సినిమాలో మనల్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అవి నిజంగా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమా క్లైమాక్స్ కూడా అందరికీ నచ్చింది.

Ads

క్లైమాక్స్ సీన్ లో రిషబ్ శెట్టి కొలం ఆడే వ్యక్తిగా వస్తాడు తర్వాత కనపడకుండా వెళ్ళిపోతాడు. ఇలా క్లైమాక్స్ ఉంటుంది. చాలా మంది ఎందుకు కాంతారా సినిమాలో శివ ఆఖరున ఎందుకు కనపడకుండా వెళ్ళిపోతాడు అనే సందేహం ఉండిపోయింది. మరి ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివ కోలం ఆడిన తర్వాత అరుపు వినబడుతుంది. అడవి లోకి వెళ్లి మాయమైపోతాడు. మరి ఇంతకీ అతను బతికున్నాడా లేదా అనేది చూస్తే… అప్పటి వరకు ఏమవుతుందంటే మనిషి మీదకి పంజురులి వచ్చి సమస్యలని పరిష్కరించి వెళ్ళిపోతూ ఉంటాడు.

కానీ హీరో విషయంలోనూ అలానే తన నాన్న విషయం లో కూడా భగవంతుడు తన ఉనికి ని చాటుకోవాల్సి వచ్చింది. అందుకే అలా నమ్మని వాళ్ళు చనిపోయారు. నమ్మకం నిలబడాలంటే అది ఒక మాయ లేదా లీల అని నమ్మితేనే అది నిలబడుతుంది. ఇది భగవంతుడి లీల మాయ అని చెప్పడానికి దైవం చేరని దేహం మిగలకూడదని దేవుడు తన లో కలిపేసుకుంటాడు. కానీ గురవ విషయంలో ఇలా జరగలేదు. గురవ ని పక్క కి పిలిచి చంపేశారు. అందుకే ఇలా అవ్వలేదు.

Previous articleనువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని పింకీ ప్రస్తుతం ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Next articleకళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ”అమిగోస్” కి ఇంత అర్థం ఉందా?