టెస్ట్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు ఏం తింటారు..? లంచ్, టీ టైం లో ఏం పెడతారు..?

Ads

చాలా మందికి క్రికెట్ ఆట ఆడడం చూడడం అంటే ఎంతో ఇష్టం. క్రికెట్ మ్యాచ్ ని చూస్తే సమయమే తెలియదు. అందులోనూ మన ఇండియా క్రికెట్ ఆడితే కచ్చితంగా ఫాన్స్ చూస్తూ ఉంటారు. క్రికెట్ లో రకరకాల మ్యాచ్లు జరుగుతాయి. వన్డే మ్యాచ్ లని టెస్ట్ మ్యాచ్ లని ఇలా ఎన్నో మ్యాచ్ లని నిర్వహిస్తూ ఉంటారు. అయితే టెస్ట్ మ్యాచ్ సమయంలో క్రికెటర్స్ ఏం తింటారు..?

లంచ్ బ్రేక్ లో వాళ్ళకి ఏమిస్తారు, టీ బ్రేక్ లో వాళ్ళకి ఏమిస్తారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ ప్రశ్న ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకోండి.

లంచ్ సమయంలో..

ఈ సమయంలో ఎటువంటి వాటిని ఇస్తుంటారు అనేది చూస్తే.. లంచ్ సమయంలో కోర ప్రకారం ఆటగాళ్ళకి లంచ్ కి మూడు నుండి ఐదు రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అయితే ఇవి శాకాహారులకి వేరుగా మాంసాహారులకు వేరుగా ఉంటాయి. ఐస్ క్రీములు, బ్రెడ్లని కూడా ఇస్తూ ఉంటారు. శాకాహారులకి బంగాళదుంప అలానే పప్పులు వివిధ రకాల కూరగాయలను ఇస్తూ ఉంటారు.

Ads

మాంసాహారులకి చికెన్ వంటివి ఇస్తూ ఉంటారు. అయితే ఆటగాళ్లకి ఏం తినాలి అనిపిస్తే వాటిని తింటారు. బ్యాట్స్ మ్యాన్స్ అయితే ప్రోటీన్ బార్స్, అరటి పండ్లు అలానే మిగిలిన పండ్లను తింటూ ఉంటారు. పూర్తిగా కడుపు నిండి పోతే వాళ్లకి ఆడడం కష్టమవుతుంది. అందుకని తక్కువ ఫ్యాట్ ఉండే వాటిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

టీ సమయంలో..

టీ సమయంలో టీ, కాఫీ సాండ్విచ్ తో పాటుగా ఎనర్జీ డ్రింక్స్ ని ఇస్తారు. దీనితో మళ్లీ రీహైడ్రేట్ అవ్వచ్చు. ఆటని కూడా ఆడడానికి అవుతుంది. చాలా మంది ఆటగాళ్లు టీ బ్రేక్ సమయంలో ఒక కప్పు కాఫీ ని తీసుకుంటారు దానితో పాటుగా లైట్ గా స్నాక్స్ తీసుకుంటారు.

Previous articleSHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleసమోసా చరిత్ర మరియు భారతదేశానికి ఎలా వచ్చిందో తెలుసా?