Ads
రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో తీవ్రంగా నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా విస్పోటనంతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దాని వల్ల మేమిద్దరం మాకు ఒక్కరూ అనే నినాదంతో ఈ తరం యువత ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కుటుంబ నియంత్రణ గురించి పటిష్ట చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ దీని వల్ల వచ్చే సమస్యల గురించి ఆలోచించడం లేదు. ఇలా ఒక్కరు ఉంటే ప్రేమానురాగాలు పెరుగుతాయని అనుకుంటున్నారు. ఈ కారణం వల్లనే ఇద్దరు పిల్లలను కనడానికి వెనకడుగు వేస్తున్నారు.అయితే దీనివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే ఒంటరిగా పెరిగే పిల్లల్లో మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఒకరి కుండే అభిప్రాయాలు ఇంకోకరితో పంచుకోవడం వల్ల వారు జీవితంలో గొప్పగా ఆలోచించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Ads
దీంతో పెళ్లి అయిన జంట ఒక్కరితో ఆపకుండా ఇద్దరు పిల్లలను కనేందుకు ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన స్థితి ఏర్పడింది. ఇద్దరు పిల్లలు ఉంటే వారి అల్లరి పనులతో పాటుగా ప్రేమనురాగాలు, ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఎవరితో ఏలా ప్రవర్తించాలో వారికి అవగాహన వస్తుంది. ఇక ఒంటరిగా పెరిగే పిల్లలలో ఆత్మన్యూనత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వారిని అనారోగ్య సమస్యలు రావచ్చని తెలుస్తోంది. ఒంటరి తనం వ్యక్తిత్వ వికాసానికి శాపంగా మారుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారు అన్ని విషయాల్లోను ఎదుగుతారు.ఒక్కరు ఉన్నట్లయితే వారిలో వ్యక్తిత్వ లోపాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తోబుట్టువులు లేని పిల్లలు నలుగురిలో కలవకపోవడం లాంటివి జరగవచ్చు. అందువల్ల ఒక్కరు ముద్దు అనడానికి బదులుగా ఇద్దరు పిల్లల ఉంటేనే ఆనందం అని తెలుసుకుని, ఆచరిస్తే పిలలకు మంచిదని గుర్తుంచుకోవాలి.
Also Read: పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ వివాహం చేసుకున్న వారే ఎక్కువగా విడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా?