Ads
లైఫ్ లో సక్సెస్ అవడం అంత ఈజీ కాదు. మనం అనుకున్నది సాధించాలన్నా జీవితంలో పైకి రావాలని దానికి తగ్గ కృషి తప్పక చేయాలి. అప్పుడే లైఫ్ లో పైకి రాగలము. లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. సాధించాలని పట్టుదలతో ముందడుగు వేస్తే కచ్చితంగా జీవితంలో అనుకున్నవి నెరవేరుతాయి. లేదంటే కలలు కలలు లానే ఉండిపోతాయి.మీరు జస్ట్ డయల్ పేరు వినే ఉంటారు. ఇప్పుడు జస్ట్ డయల్ ద్వారా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
అయితే అసలు ఇంతకీ ఈ ఆలోచన ఎలా వచ్చింది..? ఏ విధంగా కష్టపడ్డారు వంటి ముఖ్య విషయాలని… వాళ్ళ సక్సెస్ స్టోరీ ని ఇప్పుడే చూస్తాం.
ఈ కంపెనీని విఎస్ఎస్ మణి మొదలుపెట్టారు. ఈయన 1966 లో జంషెద్పూర్ లో జన్మించారు. మిడిల్ క్లాస్ ఫామిలీ నుండి వచ్చారు. ఈయన పై చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు అయితే ఆర్థిక పరిస్థితులు వలన గ్రాడ్యుయేషన్ మధ్య లోనే ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఎల్లో పేజ్ అనే ఒక కంపెనీ లో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయితే ఈయన ఉద్యోగం ఏమిటంటే ఆర్గనైజేషన్, కాలేజీలు, ఆఫీసుల వారి ఫోన్ నెంబర్లుని, వివరాలని సేకరించాలి. ఇక్కడ పని చేస్తూ మణి ఫోన్ లోనే ఈ డేటా అంతా ఉంటే బాగుంటుందని ”అస్క్ మీ” అని ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారు.
Ads
కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఒక స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టారు. 1996లో జస్ట్ డయల్ ని స్టార్ట్ చేశారు ఫర్నిచర్ ని కంప్యూటర్లని అద్దెకి తీసుకుని ఒక చిన్న గ్యారేజ్ ని ఓపెన్ చేశారు. అప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే ఇందులో పని చేసేవారు. తర్వాత క్రమంగా కంపెనీ అభివృద్ధి చెందింది.
ఫ్రీగా సమాచారం ఇవ్వడానికి బదులుగా ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు అలానే యూజర్లకి సరైన ఇన్ఫర్మేషన్ ఉండేలా జస్ట్ డయల్ చూస్తుంది. 1996లో ఈ కంపెనీ మొదలైంది. అప్పుడు చిన్నగా ఓ గ్యారేజీ లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు కోట్లల్లో లాభాలని తెచ్చుకుంటోంది. పైగా పదకొండు వేల మందికి పైగా ఉద్యోగులకి ఉపాధినిస్తోంది.