Ads
హాయిగా కొనసాగుతున్న జీవితంలో హఠాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగానే కాకుండా ఆర్థికంగా వారికి చాలా నష్టం జరుగుతుంది. అప్పటి దాకా పొదుపు చేసి కూడబెట్టుకున్న డబ్బు మొత్తం ఒక్కసారిగా ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంటుంది.
Ads
కానీ సమయానికి చేతిలో డబ్బు లేకుంటే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇలాంటి పరిస్తితుల్లోనే ఆదుకునేవి హెల్త్ పాలసీలు అని చెప్పవచ్చు. అయితే చాలా మంది హెల్త్ పాలసీలు తీసుకోవడం వృథా ఖర్చు అని అనుకుంటారు. కరోనా ప్రభావం వల్ల దాదాపు అందరికి ఆరోగ్య పాలసీల ప్రాధాన్యత తెలిసి వచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది బెస్ట్ హెల్త్ పాలసీల గురించి వెతుకుతున్నారు. అయితే అలాంటి వారి కోసం ఎల్ఐసీ సంస్థ ఆరోగ్యానికి సంబంధించిఒక పాలసీని అందుబాటులోకి తెచ్చింది.
ఆ పాలసీ పేరు జీవన్ ఆరోగ్య పాలసీ. ఈ పాలసీ యొక్క కార్డు ద్వారా ఫ్యామిలీ రూపాయి ఖర్చు పెట్టకుండా చికిత్స చేయించుకోవచ్చు. ప్రభుత్వ బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందరికి సూపరిచితమే. ఈ సంస్థ తమ వినియోగదారుల కోసం, కొత్తవారి కోసం ఎన్నో పాలసీలను అందిస్తూ ఉంటుంది. అది కూడా తక్కువ ప్రీమియం కలిగి ఎక్కువ లాభాలను పొందేట్టుగా అనేక రకాలైన పాలసీలను అందరికి అందుబాటులోకి తెచ్చింది. ప్రజల హెల్త్ కోసం ఎల్ఐసీ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన పాలసీలలో ‘జీవన్ ఆరోగ్య పాలసీ’ కూడా ఒకటిఇక ఈ పాలసీలో చేరిన ఫ్యామిలికి ఒక హెల్త్ కార్డు అందచేస్తారు. ఈ పాలసీ ద్వారా అనుకోకుండా ప్రమాదాలు జరిగిన సమయంలో ఇరవై నాలుగు గంటల పైన హాస్పటల్ లో పొందే ట్రీట్మెంట్ కి రూపాయి కూడా కట్టాలసిన అవసరం లేదు. అయితే తీసుకునే ప్రీమియం ప్రకారంగా ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ఎల్ఐసీ అందిస్తున్న ఈ పాలసీతో మరిన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి.ఈ పాలసీతో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆరోగ్యభీమా వర్తిస్తుంది. 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పిల్లలకి అయితే 25 సంవత్సరాల వరకు, పెద్దవారికి అయితే 80 సంవత్సరాల వచ్చే వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. ఇక ఈ పాలసీ పూర్తి వివరాలు తెలుసుకోవడం వెబ్సైట్ లో కానీ, మీకు సమీపంలో ఉండే ఎల్ఐసీ ఆఫీస్ ని సంప్రదించవచ్చు.
Also Read: ”ఆస్తి పత్రాలు” పోగొట్టుకుంటే ఏం చెయ్యాలి..? ఎలా డాక్యుమెంట్స్ ని పొందాలి..?