Ads
ఇండస్ట్రీలో అవకాశాలు రాక చాలామంది ఎంత గానో ఇబ్బంది పడుతూ ఉంటారు. టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు రాక తెగ తిరుగుతూ ఉంటారు. అయితే అవకాశాలు వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకొని వారు కూడా చాలామంది ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కొంత మంది కేవలం మాటతో నోరు జారి అవకాశాలని కోల్పోయారు. మరి మాటతో నోరు జారీ అవకాశాలని కోల్పోయిన నటులు గురించి ఇప్పుడు చూద్దాం.
#1. వడివేలు:
వడివేలు మనకి సుపరిచితమే. స్టార్ కమెడియన్ ఈయన. తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు. వడివేలు స్నేహితుడైన రజినీకాంత్ రాజకీయ ప్రయోజనాల కోసం జయలలిత పై సిల్లీ కామెంట్లు చేశారు. ఇలా వడివేలు అవకాశాలని కోల్పోవడం జరిగింది.
#2. జమున:
షూటింగ్ అప్పుడు నాగేశ్వరావు చేయి జమున భుజం మీద పొరపాటు పడింది అయితే కావాలని చేశారని జమున నోరు పారేసుకోవడంతో అవకాశాలు లేకుండా చేసారు. దీనితో ఐదు సంవత్సరాలు పాటు ఆమె కి అవకాశాలు రాలేదు.
#3. హేమ:
Ads
టాలీవుడ్ మా యూనియన్ ఎలక్షన్ లో జరిగిన గొడవలప్పుడు స్టార్స్ ని తిట్టడం మూలాన అవకాశాలు కోల్పోయారు. రాజేంద్రప్రసాద్ ని నాగబాబుని మీడియా ముందు తిట్టడం బ్రహ్మానందం తో ఉన్న వివాదాలు ఇలాంటి కారణాల వలన ఆమె అవకాశాలని కోల్పోయారు.
#4. వాణిశ్రీ:
అప్పుడే రిలీజ్ అయిన కృష్ణ దేవదాస్ సినిమా మీద ఆమె సెటైర్ వేశారు. దీంతో విజయనిర్మలకి కోపం వచ్చింది. అప్పటినుండి కృష్ణ సినిమాలలో ఆమెకి అవకాశాలు లేవు.
#5. రోజా:
”కమల్ హాసన్ సినిమాలో ఏముంటుంది..? రొమాన్స్, ముద్దులే కదా” అని రోజా అనడంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం కోల్పోయారు.
#6. నరసింహారాజు:
తుఫాను సమయంలో నిధులను కలెక్ట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లని ఉద్దేశించి నరసింహారాజు ”వాళ్ళే ఇవ్వచ్చు కదా వాళ్లకి ఏమైనా డబ్బులు తక్కువా” అని విమర్శించారు దీంతో అవకాశాలు తగ్గిపోయాయి.