మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Ads

తెలుగు సినిపరిశ్రమలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మోహన్ బాబు కుమారుడిగా మంచు మనోజ్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ మంచు మనోజ్ ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకున్నాడు.

బిందాస్, మిస్టర్ నూకయ్య, వేదం, కరెంట్ తీగ వంటి సినిమాలతో మనోజ్ మంచి గుర్తింపు సొంతం  చేసుకున్నారు. అయితే ఆయన తండ్రి మోహన్ బాబు వలె స్టార్ హీరోగా మాత్రం కాలేదనే చెప్పవచ్చు. మంచు కటుంబంలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి  మంచు మనోజ్. మనోజ్ సినిమాలు ఈయన సినిమాలు వచ్చి సుమారు నాలుగు ఏళ్లు అయ్యాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కొత్త మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Ads

ఇక మంచు మనోజ్ గా మార్చి 3న‌ దివంగత టిడిపి నేత అయిన భూమా నాగిరెడ్డి రెండవ కూతురు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఇది మంచు మనోజ్ కు రెండవ వివాహం. ఇంతకు ముందే మనోజ్ కు పెళ్లి జరిగింది. అయితే విభేదాల వల్ల ఆయన మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చారు. మనోజ్ 2017లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి పెద్దలందరి సమక్షంలో చాలా  వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగిన రెండేళ్ల‌కే విభేదాలతో విడాకులు తీసుకున్నారు. మనోజ్ రెండవ పెళ్లి గురించిన వార్తలు నెట్టింట్లో  వైరల్ అయినప్పటి నుండి మనోజ్ ఫస్ట్ భార్య గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందని? ఆమె కూడా రెండవ పెళ్లి చేసుకుందా అని? ఏం చేస్తుందనే వాటి గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మనోజ్ మొద‌టి భార్య‌ ప్రణతి అమెరికాలో ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని జీవిస్తున్నారు. ఈమె అక్కడే ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా  కొనసాగుతున్నారని సమాచారం
Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..

Previous articleవిపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..
Next articleడబ్బుల విషయంలో చాలా మంది మోసం చేశారు.. హీరోయిన్ ల‌య‌
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.