ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

Ads

మహేశ్వరి, తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు సుపరిచితమే. ఇప్పటి ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం  లేనప్పటికీ, 90ల ఆడియెన్స్ కి సుపరిచితమే. మహేశ్వరి తెలుగు, కన్నడ, తమిళ భాషలలో సుమారు 35 సినిమాలలో నటించిది. తనదైన నటనతో ఆడియెన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

మహేశ్వరి అమ్మాయి కాపురం సినిమాతో 1995లో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ తర్వాత జేడీ చక్రవర్తితో నటించిన ‘గులాబీ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ఈ మూవీతో అప్పటి యువతకి డ్రీమ్ గర్ల్ గా మారింది. ఆ తరువాత ఆమె నటించిన ‘పెళ్లి’ మూవీతో మంచి గుర్తింపు పొందింది.  నీకోసం, మా బాలాజీ, ప్రియరాగాలు వంటి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుంది.
ఇక అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. మహేశ్వరి తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో అజిత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆమె టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే జయకృష్ణ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.ఆమె చివరగా నటించిన సినిమా ‘తిరుమల తిరుపతి వెంకటేశ’. అయితే పెళ్లి అయిన కొన్ని ఏళ్లకు 2012 లో మహేశ్వరి జీ తెలుగులో ఒక సీరియల్‌లో నటించింది. అప్పట్లో ఈ సీరియల్ బుల్లితెరపై హిట్ గా నిలిచింది. ఆ తరువాత మళ్ళీ ఆమె నటించలేదు. మహేశ్వరి సీనియర్ హీరోయిన్ శ్రీదేవికి కజిన్ సిస్టర్ అన్న విషయం అందరికి తెలిసిందే.
మహేశ్వరి ఇప్పటివరకు కూడా అభిమానులకు, సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉంది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరి బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్‌కు తోడుగా, ఆమెతో ఉంటున్నారని సమాచారం. అలాగే మహేశ్వరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.
Also Read: డబ్బుల విషయంలో చాలా మంది మోసం చేశారు.. హీరోయిన్ ల‌య‌

Ads

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Previous articleమ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ సతీమణి ఫోటో చూశారా?
Next articleయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కుంటి గుర్రంతో పోల్చిన జక్కన్న.. ఎందుకో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.