Ads
కాల్షియం లోపం అనేది పిల్లల్ల ఎదుగుదల పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. దాంతో పిల్లలు నీరసంగా కనిపిస్తుంటారు. వారిలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
అందువల్ల పిల్లల్లో ఏర్పడే కాల్షియం లోపాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక పిల్లల్లో కాల్షియం లోపం తలెత్తకూడదు అంటే వారు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చాలి. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.పాలకూర:
పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా పోలిక్ యాసిడ్, విటమిన్ కే, సి, ఐరన్ లు ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు చాలా సహాయపడతాయి.
Ads
2.సోయాబీన్స్ :
కాల్షియం సోయాబీన్స్ లో పుష్కలంగా లభిస్తుంది. దాదాపు 100గ్రాముల సోయాబీన్స్ లో 250ఎంజీ కన్నా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అంతే కాకుండా ఫైబర్, ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఉండే ప్రొటీన్ లోపాన్ని వీటి ద్వారా తీర్చవచ్చు.
3.పెరుగు:
పెరుగు పిల్లల ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది. ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పిల్లలకు అవసరమైన కాల్షియం కోసం రోజుకి ఒక స్పూన్ చొప్పున పెరుగు తినిపించాలి. ఇది పిల్లలు ఎదుగుదలకి తోడ్పడుతుంది.4.బ్రొకలి:
బ్రొకలిని తినేందుకు పిల్లలు ఆసక్తి చూపరు. అయితే ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, కె మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. 5.బాదం:
బాదం పప్పులను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే తీసుకుంటే మెదడుకు, ఎముకలకు చాలా మేలు చేస్తుంది. పిల్లలు వీటిని రోజు తినేలా చూడాలి.
6.కాయధాన్యాలు, గింజలు :
కాయధాన్యాల్లో చాలా పోషకాలు లభిస్తాయి. ఇవి ఆహారంలో చేర్చడం వల్ల పిల్లలు చురుకుగా ఉండేలా చేస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చినట్లయితే పిల్లల ఎదుగుదలకి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వారిలో వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.7.చీజ్:
పిల్లలకు ఇంట్లో తయారుచేసిన చీజ్ ను వారి ఆహారంలో చేర్చండి. దీనిలో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. చీజ్ తీసుకోవడం ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.. 8.చియా విత్తనాలు :
చియా విత్తనాలు పిల్లలకు ఇవ్వడం ద్వారా కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.Also Read: మూత్రపిండాలలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను పాటించండి..!