హీరో జయం రవి క్యూట్ ఫ్యామిలీని చూశారా? వైరల్ గా మారిన పొటోలు..

Ads

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో  ‘జయం’ రవి కుటుంబానికి చెందిన  అందమైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

జయం రవి ఎవరో కాదు ఎడిటర్ మోహన్ రెండవ కుమారుడు. ఎడిటర్ మోహన్ గురించి తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు బ్రాండ్ అనేలా ఉండేవి. మోహన్ సుమారు 200 సినిమాలకు పైగా ఎడిటర్ గా పని చేశారు.
టాలీవుడ్ లో 10 చిత్రాలు, కోలీవుడ్ లో 5 చిత్రాలను నిర్మించారు. అంతే కాకుండా 60 తెలుగు చిత్రాలను తమిళం లోకి డబ్ చేశారు. ఆయన పేరు భార్య వరలక్ష్మీ. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు మోహన్ రాజా తమిళంలో దర్శకుడిగా, రెండవ కుమారుడు జయం రవి హీరోగా రాణిస్తున్నారు. మోహన్ రాజా తెలుగులో జగపతి బాబు, అర్జున్, వేణు హీరోలుగా వచ్చిన హనుమాన్ జంక్షన్, మెగాస్టార్ చిరంజీవితో  ‘గాడ్ ఫాదర్’ సినిమాని తీశారు.
మోహన్ రెండవ కుమారుడు జయం రవి పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. ఆయన జయం చిత్రంతో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ హిట్ అవడంతో  అప్పటి నుండి జయం రవిగా మారారు. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలను రవి కోలీవుడ్ లో  రీమేక్ చేసి హిట్ కొట్టారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి, వంటి చిత్రాలను రీమేక్ చేసిన జయం రవి విజయం అందుకున్నారు.
గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన పొన్నియన్ సెల్వన్ గా ఆకట్టుకున్నారు. హీరో జయం రవి భార్య పేరి ఆర్తి. వారికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజెన్లు బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ టూ చిరంజీవి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్లుగా ఎదిగిన 7 గురు హీరోలు..

Ads

 

View this post on Instagram

 

A post shared by Aarti Ravi (@aarti.ravi)

Previous articleలక్ష్మి పార్వతి ఆద్వర్యంలో ఉన్న ఎన్టీఆర్ మ్యూజియం గురించి తెలుసా?
Next articleబాహుబ‌లి మూవీలో త‌మ‌న్నా క్యారెక్టర్ చేజార్చుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.